సాహోని టార్గెట్ చేసిన నార్త్ మీడియా?

Update: 2019-08-17 05:14 GMT
సౌత్  నుంచి వచ్చేవి రీజనల్ సినిమాలని ఒకరకమైన చులకన అభిప్రాయం నార్త్ ప్రేక్షకులకు మీడియాకు ఒకప్పుడు బాగా ఉండేది. కాలక్రమేణా వచ్చిన మార్పుల దృష్ట్యా ఉత్తరాది ఆడియన్స్ తెలుగు తమిళ మూవీస్ ని డబ్బింగ్ రూపంలో ఎగబడి చూడటం మొదలుపెట్టారు. బాహుబలి వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. తలలు పండిన ఖాన్ల వల్ల కూడా కానీ రికార్డులు బాహుబలి మంచి నీళ్లు తాగినంత ఈజిగా కొల్లగొట్టడం చూసి అందరికి మతి పోయింది.

ఇప్పుడు సాహో వంతు. ఒకవేళ ఇదీ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే బాలీవుడ్ స్టాండర్డ్ సవాల్ చేసే రేంజ్ లో ఇంకా చెప్పాలంటే దాటిపోయే లెవెల్ లో పేరు రావడం ఖాయం. కానీ ముంబై మీడియా మాత్రం దీన్ని స్పెషల్ గా టార్గెట్ చేసినట్టు వినికిడి. ఇలాగే కబీర్ సింగ్ మీద తమ అక్కసుని విషాన్ని కక్కిన కొందరు క్రిటిక్స్ ఫైనల్  గా వసూళ్లనైతే ఆపలేకపోయారు. 290 కోట్లకు పైగా కలెక్షన్లతో ట్రేడ్ ని సైతం బాప్రే అనుకునేలా చేసింది తెలుగు దర్శకుడు సందీప్ వంగానే

 సాహో ఎంత పెద్ద బడ్జెట్ తో రూపొందిన క్యాస్టింగ్ అంతా హిందీ బ్యాచే ఉన్నా తీసింది నటించింది తెలుగు వాడు కాబట్టి ఆ మీడియా అవసరానికి మించి శల్యశోధన చేస్తుందనడంలో సందేహం అక్కర్లేదు. దాని ద్వంద్వ వైఖరి తెలిసిన ప్రేక్షకులు చాలా తెలివిగా ప్రమోషన్లను పబ్లిక్ టాక్ లను రెస్పాన్స్ ను ఆధారంగా చేసుకుని సినిమాకు వెళ్లాలా వద్దా అని డిసైడ్ చేసుకుంటున్నారు.

ఇక్కడ డార్లింగ్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటుంది. రిలీజ్ రోజున సోషల్ మీడియాలో వ్యక్తమయ్యే అభిప్రాయాలకు రెచ్చగొట్టేలా వచ్చే ముంబై రిపోర్ట్స్  కు రియాక్ట్ కాకుండా సైలెంట్ గా ఉండటమే. ఎలాగూ కంటెంట్ మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళు ఎంత నెగటివ్ ప్రాపగండా చేసినా ఫైనల్ గా తీర్పు ఉండేది హాల్ కు వచ్చిన జనం చేతిలోనే. అందుకే కబీర్ సింగ్ తరహాలో ముంబై మీడియా సాహోకు అదే రిపీట్ చేస్తుందేమో వేచి చూడాలి


Tags:    

Similar News