టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో అల్లూరి పాత్ర పోషించిన రామ్ చరణ్ కి జోడీ అన్నట్లుగా సీత పాత్రలో నటించిన ఆలియా భట్ కి ఆశించిన స్థాయిలో స్కోప్ దక్కలేదు. ఆమె అభిమానులు కూడా తీవ్రంగా నిరాశ పడ్డారు. సినిమాలో ఆమె పాత్ర ను మరీ కుదించారు అంటూ కొందరు రాజమౌళి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆలియా పాత్ర చాలా చిన్నదే అవ్వడంతో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. కానీ తాజాగా ఆమె నటించిన బ్రహ్మాస్త్ర సినిమా తో ఆమె మెప్పించింది. ఆ సినిమా విడుదల అవ్వకుండానే ఎలా మెప్పించిందా అనుకుంటున్నారా... తెలుగు జనాలు ఆలియాను ఒక్కసారిగా అభిమానించడం మొదలు పెట్టారు.
తెలుగు మీడియా మరియు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆలియాను అభినందిస్తున్నారు. కారణం ఆమె బ్రహ్మాస్త్ర లోని పాటను తెలుగు లో అద్భుతంగా పాడటమే. ఆలియా తెలుగు లో చక్కగా మాట్లాడటం మాత్రమే కాకుండా తెలుగు లో పాట పాడి అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతే కాకుండా నిన్న మీడియా సమావేశంలో తన భర్త.. బ్రహ్మాస్త్ర హీరో అయిన రణబీర్ కపూర్ తెలుగు లో మాట్లాడిన సమయంలో చిన్న పిల్ల మాదిరిగా సంబరపడుతూ చప్పట్లు కొట్టింది. తెలుగు లో ఆమె పాట పాడాల్సిన అవసరం లేదు... ఆయన తెలుగు లో మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా కూడా వారు ఇద్దరు కూడా చాలా కష్టపడి నేర్చుకుని మాట్లాడారు.. పాట పాడారు.
దీంతో ఆలియా తెలుగు వారికి చాలా నచ్చింది. ఆమె వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. నిజానికి ప్రస్తుతం ఆలియా గర్భవతి అనే విషయం తెల్సిందే. గర్భంతో ఉన్న కారణంగా ఆలియా అసలు ఈ ప్రీ రిలీజ్ వేడుకకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
అనుమానాలు పటా పంచలు చేస్తూ తెలుగు వారి కోసం వచ్చింది. కానీ దురదృష్టవశాతు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడంతో ప్రెస్ మీట్ తోనే సరిపెట్టాల్సి వచ్చింది. ఒక వేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగి ఉంటే తప్పకుండా ఆలియా అంతకు మించి అన్నట్లుగా ఆకట్టుకునేదేమో.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Full View