నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమైన చిత్రం ''వర్జిన్ స్టోరీ''. ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష - శ్రీధర్ నిర్మించారు. ఇందులో సౌమిక పాండియన్ - రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించారు.
గతంలో 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో కీలక పాత్ర పోషించిన విక్రమ్.. ఇటీవల 'రౌడీ బాయ్స్' చిత్రంతో పలకరించాడు. ఈ క్రమంలో ఇప్పుడు యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ఈ శుక్రవారం హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
'వర్జిన్ స్టోరీ' అనేది ఒక నైట్ లో జరిగే కథ.. వన్ నైట్ స్టాండ్ కు సంబంధించిన స్టోరీ. పియాన్షూ (సౌమిక పాండియన్) కు లవ్ బ్రేకప్ అవుతుంది. మోసం చేసే బాయ్ ఫ్రెండ్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి ఉత్తమ మార్గం వేరే వ్యక్తితో వన్ నైట్ స్టాండ్ అని ఆమె స్నేహితురాలు పియాన్షూను ఒప్పిస్తుంది.
ఈ క్రమంలో పబ్ లో విక్రమ్ (విక్రమ్ సహిదేవ్)ను చూసి అతనితో ఆ నైట్ స్పెండ్ చేయాలని భావిస్తుంది. వన్ నైట్ స్టాండ్ కోసం పబ్ నుండి బయటకొచ్చిన వారిద్దరికీ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏం జరిగిందనేది ఈ సినిమా కథ.
యూత్ ఆడియన్స్ ను ను టార్గెట్ చేస్తూ తీసిన సినిమా ఇది. 'కొత్తగా రెక్కలొచ్చెనా' అనే టైటిల్ ను 'వర్జిన్ స్టోరీ' గా మార్చడానికి కారణం కూడా ఇదేనని అర్థం అవుతుంది. తెలియని వ్యక్తితో ఓ రాత్రి గడిపే కాన్సెప్ట్ తో యువతని ఆకట్టుకోవాలని గతంలో వచ్చిన సినిమాలవీ కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవలేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే కోవకు చెందిందని టాక్ వచ్చేసింది.
యువతని అట్రాక్ట్ చేయడానికి పబ్ సీన్స్ తో సినిమాను నింపేసినప్పటికీ.. అందులో హృదయాన్ని హత్తుకునేలా ఏమైనా చెప్పి ఉంటే బాగుండేదని అంటున్నారు.
సినిమాకు అలాంటి టైటిల్ పెట్టాం కదా అని వర్జినిటీ గురించి సినిమాలో బలవంతంగా నాలుగు మాటలు చెప్పించినట్టుగా ఉందని చెబుతున్నారు. సమకాలీన ఇతివృత్తాలతో డీల్ చేసినా రొటీన్ గా డల్ గా సాగతీసినట్లు తెలుస్తోంది. ఆసక్తికరమైన సన్నివేశాలు లేకపోవడం - భావోద్వేగాలు పండకపోవడం డ్రాబ్యాక్స్.
విక్రమ్ సహిదేవ్ మాత్రం నటుడిగా మంచి మార్కులే వేయించుకున్నారు. ఇంతకు ముందే కెమెరాను పేస్ చేసిన అనుభవం ఉండటంతో.. చక్కని ఈజ్ తో నటించాడు. విలక్షణ పాత్రలో సిన్సియర్ గా చేసాడు.
డ్యాన్స్ కూడా బాగా చేయగలనని నిరూపించుకున్నాడు. హీరోయిన్ సౌమిక పాండియన్ కాస్తంత బొద్దుగా ఉన్నా.. చూడముచ్చటగా ఉందనిపించుకుంది. మిగతా నటీనటులు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి పాటలు.. నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్లస్ అని చెబుతున్నారు. అనీశ్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. ముందు నుంచీ యూత్ మూవీ అని నిర్మాతలు ప్రమోట్ చేస్తూ వచ్చినా.. 'వర్జిన్ స్టోరీ' సినిమాకు ఆ వర్గాన్ని మెప్పించలేకపోయిందనేది టాక్ ని బట్టి అర్థం అవుతోంది.