రాక్ ఆన్ 2.. సోది ఆపండి గురూ!!

Update: 2016-11-17 07:06 GMT
రాక్ ఆన్ 2.. రిలీజ్ వరకూ బాలీవుడ్ లో బోలెడన్ని ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న మూవీ ఇది. రాక్ ఆన్ సృష్టించిన సెన్సేషన్స్ ని ఈ సీక్వెల్ కంటిన్యూ చేసేస్తుందని అనుకున్నారంతా. కానీ మూవీ మాత్రం మొదటి షోతోనే తేలిపోయింది. ఫర్హాన్ అక్తర్-శ్రద్ధాకపూర్-అర్జున్ రాంపాల్-ప్రాచీ దేశాయ్ లు నటించిన ఈ చిత్రానికి.. రేటింగుల విషయంలోనే కాదు.. ఆడియన్స్ నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి.

వీటిన్నిటికీ తోడు 500..1000 నోట్ల బ్యాన్ ప్రభావం కూడా ఉంది. 45 కోట్ల బడ్జెట్ తో రూపొందిన రాక్ ఆన్ 2కి.. ఇప్పటివరకూ వచ్చిన మొత్తం కేవలం 12 కోట్లు. జనాలు నిస్సంకోచంగా తిరస్కరించారని చెప్పేందుకు ఇంతకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. అయితే.. రాక్ ఆన్2 టీం మాత్రం.. కేవలం కరెన్సీ నోట్ల రద్దుతోనే తమ సినిమాకు దెబ్బ తగిలిందని.. లేకపోతే బాక్సులు బద్దలు కొట్టేసేదని చెప్పేసుకుంటున్నారు.

మరి అంతలేసి కంటెంట్ ఉంటే.. కనీసం ఓపెనింగ్ రోజైనా ఫిగర్స్ ఉండేవిగా అన్నది అసలు డౌట్. రిలీజ్ రోజున కేవలం 2.02 కోట్లు మాత్రమే వచ్చాయి. పైగా మల్టీప్లెక్సుల్లో సగటున ఆక్యుపెన్సీ రేషియో 5-10శాతం మాత్రమే. జనాలకు సినిమా ఇంట్రెస్టింగ్ కలిగించలేదనడానికి ఇంతకంటే సాక్ష్యం అవసరం లేదు. సరిగ్గా అదే టైమ్ కి నోట్ల వ్యవహారం వచ్చేసరికి.. కంటెంట్ లేదనే విషయాన్ని పక్కనెట్టేసి.. సోది చెప్పేసి ఎస్కేప్ అయిపోదామని ట్రై చేస్తోంది రాక్ ఆన్2 టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News