డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకలు నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ సభలకు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవితోపాటు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు, నటీనటులు వెళ్లారు. అయితే, శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో చిరంజీవి ప్రసంగించకుండానే వెళ్లడంతో నిర్వాహకులపై ఎన్నారైలు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి అరగంట ఉండి వెళ్లిపోయారని - అంత ఖర్చు చేసి టికెట్ కొన్నప్పటకికీ కనీసం ఆయనను చూసే అవకాశం నిర్వాహకులు కల్పించలేదని వారు మండిపడ్డారు. ఇదిలా ఉండగా, శనివారం నాడు జరగుతున్న రెండో రోజు వేడుకలకు కూడా ఎన్నారైల నిరసన సెగ తగిలింది. ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు తెలపలేదని....కొంతమంది ఎన్నారైలో వేడుకలు జరుగుతున్న ఆడిటోరియం ముందు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు.
కొద్ది రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రా ప్రజలతో పాటు అన్ని పార్టీలు తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తోన్న సంగతి తెలిసిందే. కేంద్రం వైఖరికి నిరసన తెలుపుతూ రకరకాలుగా ఆందోళనలు చేపట్టారు. అయితే, ఈ ఉద్యమానికి టాలీవుడ్ నుంచి మద్దతు లేదని ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమ్మారెడ్డి భరద్వాజతోపాటు మరికొంతమంది సినీ ప్రముఖులు....ఆ ఉద్యమానికి తమ మద్దతు ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డల్లాస్ లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల వద్ద కొంతమంది ఎన్నారైలు నిరసన తెలిపారు. ఏపీలో జనసేన అధినేత - సినీ నటుడు పవన్ కల్యాణ్ మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.