టాలీవుడ్ ప్రేక్షకులు గత సంవత్సర కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్ మూవీ ఎట్టకేలకు ప్రారంభం కాబోతుంది. ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ముహూర్తంను జక్కన్న ఫిక్స్ చేసిన విషయం తెల్సిందే. జక్కన్న సినిమా అంటే పక్కా ప్రణాళికతో - సినిమా ప్రారంభంకు ముందే అన్ని విషయాలపై పట్టు సాధించి - స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసుకుంటాడనే విషయం తెల్సిందే. దాదాపు సంవత్సర కాలం సాగిన ఈ మల్టీస్టారర్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో భాగంగా ప్రస్తుతం హీరోయిన్స్ ఎంపిక పక్రియ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం ముగ్గురు ముద్దుగుమ్మలను ఎంపిక చేసేందుకు జక్కన్న ప్రయత్నాలు చేస్తున్నాడట. ముగ్గురిలో ఒక హీరోయిన్ హాలీవుడ్ ముద్దుగుమ్మ ఉండబోతుందనే టాక్ పెద్ద ఎత్తున జరుగుతుంది. సినిమా ప్రారంభ తేదీ దగ్గర పడుతున్న సమయంలో హీరోయిన్స్ గురించిన చర్చ ఎక్కువ అయ్యింది. సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రముఖ పాత్ర ఉంటుంది కనుక స్టార్ హీరోయిన్స్ ను ఎంపిక చేయాలనే పట్టుదలతో జక్కన్న ఉన్నాడు.
‘బాహుబలి’ చిత్రం తర్వాత దేశ వ్యాప్తంగా జక్కన్నకు మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని కూడా ఆల్ ఓవర్ ఇండియాలో విడుదల చేయాలని - పలు భాషల్లో డబ్ చేయాలని జక్కన్న భావిస్తున్నాడు. అందుకోసం వివిధ భాషలకు చెందిన హీరోయిన్స్ ను తీసుకోవడం వల్ల సినిమా మార్కెట్ విషయంలో ఇంకాస్త బెటర్ మెంట్ ఉంటుందని భావిస్తున్నాడట. సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలీవుడ్ నుండి ఒక హీరోయిన్ ను తీసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరో హీరోయిన్ ను సౌత్ నుండి తీసుకుంటాడేమో చూడాలి. సినిమా ప్రారంభం రోజు హీరోయిన్స్ ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కాని అది సాధ్యం కాదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.