గ్యారేజ్ లో డ్యాన్సులు హైలైట్

Update: 2016-06-28 11:30 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జనతా గ్యారేజ్ మూవీ.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతానికి టాకీ పార్ట్ పూర్తయిపోగా.. ఇంకా కొన్ని పాటలను మాత్రమే పిక్చరైజ్ చేయాల్సి ఉంది. అయితే.. ఈ మూవీకే హైలైట్ గా నిలవనున్న ఒక విషయం ఇప్పుడు బయటకొచ్చింది. జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ సూపర్బ్ డ్యాన్సులు వేయనున్నాడట.

బేసిక్ గా ఎన్టీఆర్ అదిరిపోయే స్టెప్పులకు కేరాఫ్ అడ్రస్. తను స్వతహాగా కూచిపూడి డ్యాన్సర్ కావడంతో.. ఎలాంటి స్టెప్స్ అయినా ఇరగదీసేస్తుంటాడు. జనతా గ్యారేజ్ మూవీలో వెస్ట్రన్ డ్యాన్స్ ను బేస్ చేసుకుని ఓ సాంగ్ తీశారట. దేవిశ్రీ ప్రసాద్ అందించిన హైఓల్టేజ్ ఎనర్జీ బీట్ కి.. శేఖర్ మాస్టర్ అదిరిపోయే డ్యాన్స్ కంపోజ్ చేశాడని అంటున్నారు. ఇప్పటికే ఈ పాట పిక్చరైజేషన్ కూడా పూర్తయిపోగా.. ఈ పాటలో ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ని కేకలు పెట్టించడం ఖాయంగా తెలుస్తోంది. ఎన్టీఆర్ ఈ రేంజ్ లో స్టెప్స్ వేసి చాలా కాలమైందని.. అందుకే జూనియర్ స్టెప్స్ ఈ సినిమాకి హైలైట్ అవుతాయని జనతా గ్యారేజ్ యూనిట్ అంటోంది.

మొత్తానికి జనతా గ్యారేజ్ కోసం కొరటాల చాలానే హైలైట్స్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ని ఫ్యాన్స్ ఎలా చూడలని అనుకుంటున్నారో.. అన్ని రకాలు గానూ చూపించనున్నాడనే విషయం స్పష్టమైపోతోంది. ఇన్ని హైలైట్స్ ఉంటే ఎన్టీఆర్ నుంచి ఓ ఇండస్ట్రీ హిట్ ఎక్స్ పెక్ట్ చేయడం అత్యాశేం కాదు.
Tags:    

Similar News