టాలీవుడ్ కుర్ర స్టార్ హీరోల్లో ఎమోషన్స్ పండించడంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా. ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నాడు. నటుడిగా తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేని స్టేజ్ లో ఉన్న స్టార్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో చిత్రంలో ఫాదర్ సెంటిమెంట్ ఫుల్లుగా ఉందని ఇప్పటికే చాలాసార్లు చాలామందే చెప్పారు.
ముఖ్యంగా ఓ సీన్ లో అయితే.. తన యాక్షన్ చేస్తుంటే, సినిమాటోగ్రాపర్ కన్నీళ్లు పెట్టేశాడని ఎన్టీఆర్ స్వయంగా ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు. అదే వేడుకలో మాట్లాడిన కళ్యాణ్ రామ్ కూడా.. ఈ సన్నివేశం గురించి వర్ణించాడు. మరి ఇలాంటి సెంటిమెంటల్ సీన్స్ లో జనాలను కూడా కన్నీళ్లు పెట్టించడం, వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా యాక్షన్ చేయడం ఎన్టీఆర్ స్టైల్. గతంలో చాలానే సినిమాలున్నా.. రీసెంట్ గా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన టెంపర్ సీన్స్ నే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యంగ్ టైగర్ - పోసానిల మధ్య పోలీస్ స్టేషన్ లో వచ్చే సెల్యూట్ సీన్ ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పెద్దగా మాట్లాడకుండానే.. సన్నివేశాన్ని రక్తికట్టిస్తాడు. అలాగే క్లైమాక్స్ లో కోర్ట్ సీన్ లోనూ తనే నేరం చేశానని ఒప్పుకున్నాక చేసే యాక్టింగ్ కు అయితే తిరుగుండదు. ఈ రెండు సీన్స్ ను ఎన్టీఆర్ తప్ప వేరే ఎవరూ చేయలేరన్నంతగా పండించాడు.
ఇప్పుడు మరోసారి సుకుమార్ డైరెక్షన్ లో నాన్నకు ప్రేమతో చిత్రంలో ఇంతటి ఎమోషన్స్ ను పండించబోతున్నాడు. సాధారణంగానే సుకుమార్ సీన్స్ మైండ్ గేమ్ తో పాటు ఎమోషన్స్ ను మిక్స్ చేసి ఉంటాయి. ఇప్పుడు సుకుమార్ -ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే.. ఎమోషన్స్ పీక్స్ వెళ్లిపోతాయన్న మాట. వీరికి తోడుగా సీనియర్ యాక్టర్స్ రాజేంద్రప్రసాద్ - జగపతిబాబు కూడా ఉండడంతో.. సెంటిమెంట్ - ఎమోషన్స్ తో నాన్నకు ప్రేమతో రక్తి కట్టనుందన్న మాట.