మొన్న షూటింగ్ రీ స్టార్ట్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నాడని తెలుసుకున్న తారక్ ఫ్యాన్స్ చేతికి కలిగిన గాయం పూర్తిగా మానిపోయిందనుకున్నారు. కాని ఇవాళ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నివాళి కోసం వచ్చిన జూనియర్ చేతికి బ్యాండ్ అలాగే ఉండటం చూసి అందరూ షాక్ తిన్నారు. నిజానికి తారక్ చాలా సైలెంట్ గా తెల్లవారుజామునే వచ్చి తాతయ్యకు నివాళి తెలిపి ఎక్కువ హడావిడి లేకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు.
కాని తీరా అక్కడ చేరుకున్నాక ఏ డెకరేషన్ లేక సమాధి బోసిగా ఉండటాన్ని చూసి పూలు తెప్పించి తనే స్వయంగా అభిమానుల సహాయంతో వాటిని చల్లడంతో కొంత సమయం గడపాల్సి వచ్చింది. దీంతో జూనియర్ చేయికి ఉన్న బ్యాండ్ అందరి కంట పడింది. సో పూర్తిగా మానలేదన్న క్లారిటీ వచ్చేసినట్టే. అయితే రాజమౌళి షూట్ చేస్తున్న సన్నివేశాలు చాలా చిన్నవని యాక్షన్ లాంటి ఎపిసోడ్స్ ఏమి లేని కారణంగా కాస్ట్యూమ్స్ తో బ్యాండ్ ని కవర్ చేస్తున్నారని తెలిసింది.
హైదరాబాద్ షూట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చరణ్ తారక్ ఇద్దరు అహ్మదాబాద్ షెడ్యూల్ కోసం వెళ్ళిపోతారు. అక్కడ అలియా భట్ తో సహా మిగిలిన ఇతర తారాగణం జాయిన్ అవుతుంది. అయినా జూనియర్ ఫాన్స్ మరీ ఎక్కువ ఖంగారు పడాల్సిన పని లేదు. గాయం ఇంకొద్ది రోజుల్లో పూర్తిగా సమిసిపోతుందని డాక్టర్ సూచన మేరకు ముందుజాగ్రత్త చర్యగా తప్పించి లేకపోతే ఈ పాటికే బ్యాండ్ తీసేవారని సన్నిహితులు చెబుతున్నారు. కారణాలు ఏమైనా ఆర్ఆర్ఆర్ షూటింగ్ టైంలో ఇద్దరు హీరోలు తక్కువ గ్యాప్ లో ఇలా గాయాల పాలు కావడం అనూహ్యమే