అభిమానులకు అన్నివేళలా అందుబాటులో ఉండే కథానాయకుడు ఎన్టీఆర్. ఆన్ లొకేషన్ కానీ - లేదా తనని కలిసేందుకు ఇంటివరకూ వచ్చిన అభిమానులను కానీ అతడు నిరాశపరచరని చెబుతుంటారు. అభిమానుల్ని అక్కున చేర్చుకునే మంచి మనసున్న హీరోగా తారక్ గురించి చెబుతుంటారు. ఇటీవలి కాలంలో తారక్‌లోని పరిణతి మరింతగా ఇనుమడించింది. మొన్నటిరోజున `అరవింద సమేత` ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ లోని ఎమోషన్ - అభిమానులను ఉద్ధేశించి అతడు మాట్లాడిన తీరును ఎవరూ అంత తేలిగ్గా మర్చిపోలేరు. ఒక పరిపూర్ణుడిలోని బ్యాలెన్స్ డ్ యాటిట్యూడ్ అందరికీ కనిపించింది. మూడు పదుల వయసు దాటాక వచ్చే ప్రత్యేకమైన పరిణతితో కూడుకున్న గ్లింప్స్ అది.
అదంతా సరే.. ప్రస్తుతం తారక్ `అరవింద సమేత` మరో ఐదు రోజుల్లో రిలీజ్ కి రెడీగా ఉంది కాబట్టి.. సినిమా ప్రమోషన్స్ పరంగా వేగం పెంచుతున్నారట. ఈ శనివారం నుంచి మొదలు పెట్టి తారక్ షెడ్యూల్ చాలా రష్ గా ఉంటుందిట. తొలిగా ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలతో ప్రారంభించి ఒక్కో మీడియాకి సపరేట్ గా ఇంటర్వ్యూలు ఇస్తూ రిలీజ్ వరకూ ఒకటే హడావుడిగానే ఉంటారని తెలిసింది. త్రివిక్రమ్ తో సినిమా ఎంతో ప్రతిష్ఠాత్మకం అని భావించిన తారక్ ప్రమోషన్స్ లోనూ రాజీకి రాకుండా మీడియాతో ఇంటరాక్ట్ అవుతారట. రేపు ఇందిరానగర్- ఎన్టీఆర్ ఆర్ట్స్ కార్యాలయంలో జరిగే ప్రింట్ మీడియా ఇంటర్వ్యూలకు మాత్రం అభిమానులకు నో ఎంట్రీ అని స్ట్రిక్టుగా మెసేజ్ ని పంపించడాన్ని బట్టి చూస్తుంటే.. ఇదంతా తారక్ నుంచి స్ట్రిక్టు ఆర్డర్ అనే అర్థమవుతోంది. మీడియా మినహా ఔటర్స్ నాట్ అలోవ్డ్ అని ప్రత్యేకంగా సంక్షిప్త సందేశం ఇప్పటికే రిలీజైంది. కేవలం ప్రమోషనల్ మూడ్ మినహా వేరొక మూడ్ లేదనే దీనర్థం.
రిలీజ్ తర్వాత మాత్రం నెలరోజుల పాటు ఎవరికీ చిక్కకుండా విదేశాలకు తారక్ కుటుంబ సమేతంగా వెకేషన్‌కి వెళుతున్నారు. అరవింద సమేత చిత్రీకరణ సమయంలోనే తండ్రి గారైన నందమూరి హరికృష్ణ ఆకశ్మిక మరణం చాలానే కలతకు గురి చేసింది. ఆ ఘటన అనంతరం ఐదో రోజు నుంచే సెట్స్ కి వెళ్లి రేయింబవళ్లు శ్రమించాల్సొచ్చింది. అందుకే ఇప్పుడు సుదీర్ఘమైన సెలవు తీసుకుని కాస్త పునరుత్తేజితుడై మళ్లీ తిరిగి జక్కన్నతో కలిసి యుద్ధం ప్రారంభించాల్సి ఉంటుంది. రాజమౌళితో మల్టీస్టారర్ నవంబర్ లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.