మహేష్‌ తో జై లవ కుశ యుద్దం

Update: 2017-06-26 04:49 GMT
ఇప్పుడు టాలీవుడ్ లో వేస్టు చేసుకున్న సమ్మర్ సీజన్.. క్యాష్‌ చేసుకోలేకపోయిన డిజె కంటే.. రాబోయే పెద్ద సినిమాల గురించే చర్చలు ఎక్కువయ్యాయ్. ఎలాగో ముందే వస్తాయనుకున్న రామ్ చరణ్‌ రంగస్థలం.. పవన్-త్రివిక్రమ్ మూవీ ఆల్రెడీ సంక్రాంతి 2018 అంటూ సెలవిచ్చాయి. సో ఇప్పుడు బరిలో మిగిలింది ఇంకో మూడు సినిమాలు. విశేషం ఏంటంటే.. వీరందరూ అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి తరహాలో ఒక్కసారే వస్తున్నారు.

ఆల్రెడీ సెప్టెంబర్ 21న తన ''స్పైడర్'' రిలీజ్ అంటూ గతంలో మహేష్‌ కన్ఫామ్ చేశాడు. ఏ.ఆర్. మురుగుదాస్ డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పుడు ఇదే డేట్ ను ఎన్టీఆర్ ట్రిపుల్  యాక్షన్లో నటిస్తున్న ''జై లవ కుశ'' సినిమాకు కూడా కన్ఫామ్ చేశారు. మీ అందరికీ ఆశ్చర్యకరమైన ఈద్ (రంజాన్) గిఫ్ట్ ఇదే.. అంటూ.. సెప్టెంబర్ 21న జై లవ కుశ సినిమా రిలీజవ్వబోతోంది అంటూ ప్రకటించారు. ఇందులో ఆశ్చర్యం కంటే కూడా.. రెండు పెద్ద సినిమాలు ఒకే రోజున వస్తే.. అసలు ఓపెనింగ్స్ పై ఎటువంటి ప్రభావం ఉంటుందా అనే టెన్షనే ఎక్కువే ఉంది. ఈ యుద్దంలో ఇద్దరూ గెలిచినా కూడా.. రెవెన్యూలు మాత్రం షేరింగులు చేసుకోవాలి. అది పరిస్థితి.

ఇప్పటివరకు మామూలు స్థాయి కమర్షియల్ డ్రామాలు తీసిన కె.ఎస్.రవీంద్ర (బాబీ) ఇప్పుడు ట్రిపుల్ యాక్షన్ కథతో భారీ బడ్జెట్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్ సరసన రాశి ఖన్నా మరియు నివేదా థామస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News