ప్చ్.. ఎన్టీఆర్ సీమ గెటప్పు లీకయింది!

Update: 2018-07-29 10:03 GMT

లీకులు కామనే.  వికీ లీక్స్ నుండి మొదలు పెడితే క్వశ్చన్ పేపర్ లీక్స్ వరకూ.. సుచి లీక్స్ దగ్గరనుండి  సినిమా లొకేషన్ నుండి జరిగే ఫోటో లీక్స్ వరకూ అంతా కామనే.  మరి ఇంత సాధారణమైన విషయాన్ని 'అరవింద సమేత' టీం ఎలా తప్పించుకోగలుగుతుంది? ఇప్పటికే ఎన్టీఆర్- నాగబాబుకు సంబంధించి ఓ ఎమోషనల్ సీక్వెన్స్ లోని ఫోటో లీకయింది.  తాజాగా 'అరవింద సమేత' షూట్ లొకేషన్ నుండి మరో పిక్ లీకయింది.

ఈ సారి ఎమోషనల్ పిక్ కాదు.. ఎన్టీఆర్ వీరరాఘవ అవతారంలో ఉన్న సీమ యువకుడి గెటప్.  పైన తెలుపు రంగు ఖద్దరు టైపు కుర్తా..  కిందేమో బ్లూ కలర్ జీన్స్ వేసుకొని ఎన్టీఆర్ నడుస్తూ ఉన్నాడు ఈ ఫోటోలో.  బుర్రమీసాలు లాంటివి లేకున్నా గెటప్ మాత్రం అదిరిపోయిందంతే.   ఈ ఫోటో ఇప్పటికే సోషల్ మీడియా లో వైరల్ అయింది.  'అరవింద సమేత' టీమ్ లొకేషన్ నుండి ఫోటోలు లీక్ కాకుండా యూనిట్ మెంబర్స్ ను ఫోన్లు - ట్యాబులు తీసుకురావద్దని ఆంక్షలు విధించడం లాంటి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ లీకులు మాత్రం ఆగకపోవడం విశేషం.  

మరోవైపు ఈ సినిమాను దసరా బరిలో నిలిపేందుకు ఫిలిం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.  పూజ హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.  త్రివిక్రమ్ శ్రీనివాస్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో రానున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది.  మరి త్రివిక్రమ్ వీర రాఘవగా యంగ్ టైగర్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడో వేచి చూడాలి.
Tags:    

Similar News