ఫోటో స్టొరీ: జక్కన్న కోసం భారీకాయం!

Update: 2018-12-02 10:09 GMT
ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RRR రెగ్యులర్ షూట్ నవంబర్ 19 న ప్రారంభమైన సంగతి తెలిసిందే.  మొదటి షెడ్యూల్ లో హీరోలు ఎన్టీఆర్.. చరణ్ లపై జక్కన్న  ఒక భారీ యాక్షన్ బ్లాకును తెరకెక్కిస్తున్నాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక స్పెషల్ సెట్ ను నిర్మించారు.  ఇదిలా ఉంటే చరణ్ రెగ్యులర్ లుక్ లోనే కనిపిస్తున్నాడు కానీ తారక్ మాత్రం కొత్త గెటప్ లో కనిపిస్తాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

'అరవింద సమేత' సినిమాలో స్లిమ్ గా ఫిట్ గా సిక్స్ ప్యాక్ చూపించిన తారక్ ఇప్పుడు జక్కన్న కోసం భారీకాయుడిగా మారిపోయాడు.  గతంలో సిక్స్ ప్యాక్ కోసం లాయిడ్ స్టీవెన్స్ అనే సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ సహాయం తీసుకున్న విషయం తెలిసిందే.   ఎన్టీఆర్ భారీకాయుడిగా హల్క్ అవతారం లోకి మారేందుకు కూడా ఆయనతోనే పనిచేశాడట.   భారీకాయంమాత్రమే కాకుండా గుబురు గడ్డం కూడా పెంచి గెటప్ పూర్తిగా మార్చేశాడు.

రీసెంట్ గా తారక్ కొత్త లుక్ లో ఉన్న ఫోటోస్ బయటకు వచ్చాయి.  ఒక్కసారిగా సిక్స్ నుండి దంగల్ అమీర్ ఖాన్ టైపు లుక్ లోకి మారితే ఎవరైనా షాక్ అవుతారు కదా. అలానే జూనియర్ లుక్ చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.  ఈ ఫోటో ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  


Tags:    

Similar News