ఎన్టీఆర్ వేదాంతానికి కారణం ఏంటబ్బా!

Update: 2017-09-19 11:30 GMT
ఈ జనరేషన్ స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ రేంజ్ వేరు. యంగ్ టైగర్ నుంచి సరైన సినిమా పడాలే కానీ.. రికార్డులన్నీ స్మాష్ అయిపోవడం ఖాయం. అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ నందమూరి హీరో.. ఈ మధ్యనే మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. వరుస హిట్స్.. బ్లాక్ బస్టర్స్ అకౌంట్ లో పడుతుంటే.. సహజంగా ఎవరికైనా ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోవడం.. కాసింత తలబిరుసు ప్రదర్శించడం జరిగేదే.

కానీ ఎన్టీఆర్ విషయంలో ఇది రివర్స్ లో ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ మధ్య జూనియర్ ప్రతీ టాపిక్ పైనా కాసింత వేదాంతం మిక్స్ చేసి మాట్లాడుతున్నాడు. అన్నిటికీ ఫిలాసఫీలు కూడా చెప్పేస్తున్నాడు. స్వర్గం నరకం లాంటి తాను నమ్మను అని చెబుతూనే.. ప్రతీ వ్యక్తికీ అతను చేసే మంచి పనులే సుఖ సంతోషాలను ఇస్తాయని అంటున్నాడు. ఈ జనరేషన్ లో మంచి పనులు చేస్తే కనుక.. రాబోయే తరాలకు కూడా అది ఉపయోగపడుతుందని తత్వం కూడా బోధిస్తున్నాడు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో అయితే.. తనకు 34 సంవత్సరాల వయసు వచ్చిందని.. గడ్డంలో తెల్లజుట్టు కూడా కనిపిస్తుందని చెప్పిన యంగ్ టైగర్.. మరో ఐదు సంవత్సరాలు గడిచాక గెడ్డం ఎలా మారుతుందో.. తాను ఎలా ఉంటానో తెలియదని కూడా అన్నాడు.

వయసు మీద పడకుండా మనమేమీ చేయలేం కదా అంటూ.. వేదంతాన్ని తత్వశాస్త్రాన్ని కలిపి చెబుతున్నాడు ఎన్టీఆర్. ఇందులో భాగంగానే కావచ్చు.. మహేష్ సినిమా ఆడాలని.. బన్నీ డ్యాన్సులు బాగుంటాయని.. ఇతర హీరోలను కూడా పొగుడుతున్నాడు. ఇంతకీ ఎన్టీఆర్ లో ఇంతటి మార్పునకు కారణం ఏంటో! అయినా సక్సెస్ లలో వేదాంతం బోధించే ఏకైక హీరో ఎన్టీఆర్ మాత్రమే అయుంటాడు కదూ.
Tags:    

Similar News