లిక్కర్ బిజినెస్ లోకి ఎన్టీఆర్ నిర్మాత

Update: 2016-12-31 11:30 GMT
ఎవరే అతగాడు అంటూ టాలీవుడ్ కి హీరోగా పరిచయమై.. ఆ తర్వాత నిర్మాతగా మారి చుక్కల్లో చంద్రుడు.. జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము లాంటి మాస్ మసాలా మూవీ అందించాడు అలెగ్జాండర్ వల్లభ. ఆ తర్వాత మళ్లీ మళ్లీ ఇది రాని రోజు అనే మూవీతో కూడా ఆకట్టుకున్నాడీ ప్రొడ్యూసర్. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీతో పాటు ఇతర వ్యాపారాల్లో కూడా సత్తా చాటడం కామన్ అయిపోవడంతో.. ఈయన లిక్కర్ వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.

సొంత బ్రాండ్ పైనే క్రాఫ్టెడ్ బీర్ తయారు చేసే వ్యాపారం ఈయనకు ఉంది. పార్టీ ఈవెంట్స్ కు బీర్ సప్లై చేస్తుంది ఈయనక కంపెనీ. ప్రస్తుతం న్యూ ఇయర్ సందర్భంగా బ్రాండెడ్ తో పాటు క్రాఫెడ్ బీర్ కు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. డిసెంబర్ 31న జరగనున్న పార్టీలు ఈవెంట్ల కోసం ఈయనను చాలా పార్టీలే అప్రోచ్ అయ్యాయట.

కొన్ని పార్టీల్లో వల్లభ కంపెనీ అందించే బ్రాండ్ బీర్ సప్లై కానుండగా.. వాటిలో దుర్గం చెరువు దగ్గర జరిగే పార్టీ కూడా ఒకటి. ప్రముఖ డీజేలు ఎన్‌.వై.కే.. టాళీ షమ్, కార్నివోర్ లు న్యూ ఇయర్ బాష్ లో పెర్ఫామ్ చేయనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా అలెగ్జాండర్ వల్లభ బీర్ బిజినెస్ మూడు టిన్నులు.. ఆరు డ్రమ్ములు అన్నట్లుగా సాగుతోందట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/


Tags:    

Similar News