జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రాబోతున్న అరవింద సమేత వీర రాఘవ కౌంట్ డౌన్ గంటల్లోకి మారిపోయాక అభిమానులు టెన్షన్ తో సమయాన్ని యుగంలా గడిపేస్తున్నారు. చాలా కాలం తర్వాత తారక్ పూర్తి స్థాయి సీమ ఫ్యాక్షనిజం నేపధ్యంలో చేయడంతో అంచనాలు మాములు కంటే ఓ ఐదారు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే కథకు సంబంధించిన లీక్స్ కొన్ని సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్ గా ఉండగా ఇప్పుడు మరికొన్ని తోడయ్యి ఫ్యాన్స్ కు డబుల్ కిక్ వస్తోంది.
వాటి ప్రకారం ఇందులో రాఘవ అలియాస్ వీర రాఘవ రెడ్డి అరవిందకు బాడీ గార్డ్ గా కనిపిస్తాడట. ఫస్ట్ హాఫ్ లో శత్రువుల నుంచి ఓ ప్రమాదంలో అరవిందను కాపాడినందుకు అతనికే తన రక్షణ బాద్యతలు ఇచ్చి చెబుతారట పూజా హెగ్డే కుటుంబ సభ్యులు. ఆ తర్వాత సీమ ఫ్యాక్షన్ కు అరవింద రాఘవ ఇద్దరికీ కనెక్షన్ ఉందన్న సంగతి తెలుస్తుందట. దీంతో యుద్ధం ఆపెవాడే మగాడు అని పూజా మాటను స్ఫూర్తిగా తీసుకుని తన ఊరికి బయలుదేరిన రాఘవ రెడ్డి ఎలాంటి సవాళ్ళు ఎడురుకున్నాడు అనేదే కథగా చెప్పుకుంటున్నారు.
ఇక సునీల్ కు సంబందించిన అప్ డేట్ కూడా ఉంది. నీలాంబరి అనే గ్యారేజ్ ఓనర్ పాత్రలో సునీల్ ది కామెడీ తో పాటు ఎమోషనల్ టచ్ ఉన్న పాత్రగా డిజైన్ చేసినట్టు టాక్. సునీల్ తో పాటే ఆ గ్యారేజ్ లోనే ఉంటూ అతనికి మంచి బిజినెస్ వచ్చేలా చేయడంలో రాఘవ చేసే పనులు హార్ట్ టచింగ్ గా ఉంటాయని తెలిసింది. అంతే కాదు ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లో సీమ గ్రామంలో కూడా సునీల్ పాత్ర ఉండేలా త్రివిక్రమ్ సెట్ చేసారట. మొత్తానికి ఊహాతీతంగా సాగే కథా కథనాలతో త్రివిక్రమ్ ఏదో మేజిక్ చేయబోతున్నట్టే కనిపిస్తోంది.