అరవింద సమేత లైవ్ ఆద్యంతం ఎమోషనల్. అన్నదమ్ములు తారక్ - కళ్యాణ్ రామ్ లోని ఎమోషనల్ షో ఇది. బిగ్ బాస్ లో దొరకనిది - రియాలిటీలోనే దొరికినదీ ఈ అదృష్టం అనుకోవాలి. కళ్యాణ్ రామ్ స్పీచ్ తో ఏడిపించాడు. తారక్ అంతకు పదింతలు ఏడిపించాడు. అంతగా బ్రదర్స్ ఎమోషన్ రగిలించారు. అభిమానులే కాదు ఈ సాయంత్రం టీవీలు చూసినవాళ్లంతా కంట తడి పెట్టకుండా ఉండలేరు!
యంగ్ యమ ఎన్టీఆర్ మాట్లాడుతూ -`` ఇది 12 సంవత్సరాల నా కల.. త్రివిక్రమ్ గారితో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నాం. ఎలా చేస్తే బావుంటుంది. ఎన్నిసార్లు అనుకున్నా ఎప్పుడూ కుదరలేదు. ప్రతిసారీ ఏదో ఒక చిన్న గ్లిచ్ వచ్చేది. అదేంటో నాకు అర్థం కాలేదు.ఆయనకూ అర్థం కాలేదు. `నువ్వే నువ్వే` చిత్రం చేయకముందు నుంచి నాకు చాలా దగ్గరైన మిత్రుడు. ఎందుకు? మీకు ఎందుకు కుదరట్లేదు. ఇంత మంచి మిత్రులం. కష్టసుఖాలన్నీ మాట్లాడుకోగలిగే మిత్రులం. ఎందుకు మనమధ్య కుదరలేదు అని అనుకునేవాళ్లం. అభిమానులు అదే అనుకునేవారు. బహుశా .. నా జీవితంలో నెలక్రితం జరిగిన సంఘటన ఈ చిత్రానికి చాలా ముడిపడి ఉందేమో! ఆయనతో చిత్రం మొదలు పెట్టిన తర్వాతే .. నెలక్రితం జరిగిన ఘటన తర్వాతే నాకు బహుశా జీవితం విలువ తెలిసింది. ఈ సినిమా తాత్పర్యం ఒకటే. ``ఆడిదైన రోజు ఎవడైనా గెలుస్తాడు. కానీ యుద్ధం ఆపినప్పుడే .. వాడే మొనగాడు!``. జీవితంలో చాలామందికి తెలిసో తెలియకో చాలా బాధలు ఉంటాయి. చాలా గొడవలుంటాయి. కానీ జీవితం అంటే కొట్టుకోవడం కాదు - తిట్టుకోవడం కాదు...బతకడం. ఎలా బతకాలో చెప్పే సినిమా అరవింద సమేత-వీర రాఘవ. మనిషిగా పుట్టినందుకు ఎలా బతకాలో - ఎలా ఆనందంగా ఉండాలో ఎలా మనిషిగా బతకాలో చెప్పిన చిత్రమే ఇది`` అన్నారు.
టైటిల్ చెప్పగానే ఇదేంటి పవర్ ఫుల్ గా లేదే టైటిల్ అన్నారు. కానీ టైటిల్ లోనే అర్థం దాగి ఉంది. ఈ సినిమా చేయడానికి ముందు పరిపక్వత రావాలనే దేవుడు ఆపి ఈరోజు చేయించాడేమో! 12 సంవత్సరాల లైన్ లో ఒక స్నేహితుడిని చూశాను - దర్శకుడిని చూశాను. సినిమా ముగిసేలోపు ఒక ఆత్మ బంధువును చూశాను. నాకు ఎలాంటి కష్టం వచ్చినా - నాకు ఎన్ని దుఃఖాలు వచ్చినా మీ అందరితో పాటు నిలిచేవాడే మా త్రివిక్రమ్. ఈ చిత్రం నా జీవితంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానుల సమక్షంలో చెబుతున్నా. ఇదంతా ఒక డెస్టినీ అని ఎలా అంటానంటే ఇది నా 28వ చిత్రం. 27 చిత్రాల్లో ఎప్పుడు తండ్రి చితికి నిప్పంటించే సన్నివేశం ఏ దర్శకుడూ పెట్టలేదు. కానీ ఈ చిత్రంలో ఎలా జరిగిందో.. యాథృచ్ఛికమో తెలీదు. మనం అనుకునేది ఒకటి.. పైనా రాసేది ఇంకటి .. ఈ నెలరోజులు నాకు ఒక అన్నలాగా - తండ్రిలా - మిత్రుడిలా తోడుగా ఉన్నాడు త్రివిక్రమ్. కొన్ని బంధాలు సక్సెస్ ఫుల్ గా సాగితే వేరుగా ఉంటుంది. మా బంధాన్ని నాన్నగారు అక్కడి నుంచి చూస్తున్నారు. సక్సెస్ అందుకుంటాం.. అని తారక్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.