షాకిస్తున్న యంగ్ టైగ‌ర్‌ ఫ్రెండ్షిప్‌

Update: 2019-01-20 06:13 GMT
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము.. చదువులమ్మ చెట్టు నీడలో
వీడలేమంటు .. వీడుకోలంటు వెళ్ళిపోతున్నాము.. చిలిపితనపు చివరి మలుపులో..!!
కేవ‌లం స్కూల్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ కొన్ని స్నేహాలు ఇలానే ఉంటాయి.

ఎక్క‌డో ఒక చిన్న రిలేష‌న్ షిప్ మొద‌ల‌వుతుంది. ఆ త‌ర్వాత ఆ స్నేహం అలా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. క‌లిసిన‌ప్పుడ‌ల్లా హాయ్ చెప్పుకునేవాళ్లు కొంద‌రైతే, రెగ్యుల‌ర్ గా క‌లిసిపోయి ల‌క్ష్యం కోసం ప‌ని చేసేవాళ్లు ఇక్క‌డ కోకొల్ల‌లుగా క‌నిపిస్తారు. ఇప్పుడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స్నేహం కూడా అలానే ఉంది.  యంగ్ డైర‌క్ట‌ర్ వెంకీతో త‌న స్నేహం గురించి `మిస్ట‌ర్ మ‌జ్ను` ట్రైల‌ర్ వేడుక‌లో రివీల్ చేసిన తార‌క్ చాలా షాకింగ్ నిజాల్నే చెప్పాడు. త‌న సినిమా ``స్టూడెంట్ నంబ‌ర్ -1`లోని `ఎక్క‌డో పుట్టి ఎక్క‌డో పెరిగి.. `` పాట‌లో త‌ర‌హాలోనే ఉందీ నిజం. ప‌రిశ్ర‌మ‌లో స్నేహాలు చాలా కొత్త‌గా వింత‌గా ఉంటాయి అన‌డానికి ఇదో నిద‌ర్శ‌నం.

``నేను ప‌రిశ్ర‌మ‌కు వచ్చిన కొత్తల్లో చాలా తక్కువ మంది ఫ్రెండ్స్‌ ఉండేవాళ్లు. వాళ్లతో వెంకీ ఒకడు. తను నాకొక నటుడిగా పరిచయం... ఆ తర్వాత రచయితగా పరిచయం... తర్వాత దర్శకుడిగా పరిచయం అయ్యాడు... నేను వెంకీకి కూడా చెప్పని మాట ఒకటుంది. తను నటుడ‌య్యాడు.. రైటర్‌ అంటున్నాడు.. ఇప్పుడు దర్శకుడు అంటున్నాడు.. ఇలా క‌న్ఫ్యూజ‌న్‌ లో ఇక‌పై ఏం చేస్తాడో అనే సందేహం ఉంది. అత‌డు రాణించ‌క‌పోతే ఎలా అని బెరుకు, భ‌యం ఉండేది`` అని త‌న ఫ్రెండు గురించి చెప్పాడు తార‌క్. ``నాకు బాగా కావాల్సిన వ్యక్తి  వెంకీ అట్లూరి. సుదీర్ఘమైన తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ప్రేమకథలు వచ్చాయి. ఎందరో ఎన్నో ప్రేమకథలు రాశారు... నటించారు. మళ్లీ ప్రేమకథ అంటున్నాడు. తొలిప్రేమ అనే టైటిల్ ను పెట్టుకున్నాడు. కొత్తగా ఏం చూపిస్తాడనే బెరుకు ఉండేది. అయితే వెంకీ తీసిన ఆ చిత్రం చూసిన తర్వాత వెంకీని చూసి గర్వపడ్డాను. ఇదేమీ ఆషామాషీ విషయం కాదు. ఐదు ఫైట్స్‌ , నాలుగు డ్యాన్సులు పెట్టి కమర్షియల్‌ సినిమా చేయడం కంటే కేవలం కథా బలంతో, నటీనటుల బలంతో ఓ కథను తెరకెక్కించడం చాలా కష్టమైన పని. తొలి చిత్రంతో తను సాధించాడు. తను ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన పనిలేదు. తను జీవితంంలో ఎంతో సాధించాలి. సాధిస్తాడు. మిస్టర్‌ మజ్ను తన కెరీర్‌ బెస్ట్‌ మూవీ అవుతుంది`` అని తార‌క్ అన్నారు.


Full View
Tags:    

Similar News