రేపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే అనే విషయం తెల్సిందే. రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం నుండి ఆయన మేకింగ్ వీడియో లేదంటే ఫస్ట్ లుక్ వస్తుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రకు సంబంధించిన వీడియో కాకుండా ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రకు సంబంధించిన సర్ ప్రైజింగ్ వీడియో రాబోతుంది.
ఈ విషయాన్ని ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. చరణ్ నీ బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేందుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలించని కారణంగా భీమ్ స్పెషల్ మీడియా తో చరణ్ బర్త్ డే ను డిజిటల్ గా నిర్వహించేందుకు సిద్దం అయినట్లుగా ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు చరణ్ స్పందిస్తూ వావ్... నేను ట్విట్టర్ లో రైట్ టైంలో జాయిన్ అవ్వడం జరిగినట్లుంది. నేను ట్విట్టర్ లో జాయిన్ కాకుంటే సూపర్ సర్ ప్రైజ్ మిస్ అయ్యేవాడిని రేపటి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్వీట్ చేశాడు.
చరణ్ బర్త్ డేకు ఎన్టీఆర్ సర్ ప్రైజింగ్ వీడియోను విడుదల చేయడం అనేది జక్కన్న అద్బుతమైన ప్లాన్ గా చెబుతున్నారు. చరణ్ బర్త్ డే కు చరణ్ లుక్ లేదా వీడియో విడుదల అయ్యి ఉంటే ఫ్యాన్స్ మద్య రచ్చ జరిగేది. ఇప్పుడు ఎలాంటి గొడవ లేకుండా ఫ్యాన్స్ చరణ్ బర్త్ డేను ఇలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.