యువ నటీనటుల్లో జూనియర్ ఎన్టీఆర్ శైలి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆప్యాయంగా పలకరించడం, ఆత్మీయుడిగా మసలుకోవడం తారక్ ప్రత్యేకత. అలా తన సహచర నటుల్లో గుర్తింపు పొందిన ఎన్టీఆర్ కు ఇప్పుడు ఓ సీనియర్ నటీమణి నుంచి ప్రశంసలు దక్కాయి. గొప్ప వ్యక్తిత్వం విషయంలో తారక్ అత్యున్నత స్థాయిలో ఉంటారని సీనియర్ నటి తులసి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తులసి మాట్లాడుతూ తారక్ తనదైన ప్రత్యేక వ్యక్తిత్వం గల మనిషి అని, ఆయన అత్యున్నత స్థాయికి ఎదుగుతారని తెలిపారు.
ఇటీవల ఓ సందర్భంలో ఎన్డీఆర్ ను కలిసేందుకు తులసి నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని తారక్ కు చెప్పారు. దీనికి తారక్ ఎంతో గొప్ప మనసుతో స్పందించారు. ``అయ్యో...అమ్మా మీరు రావడం ఎందుకు? నేనే వస్తాను``అని చెప్పడమే కాకుండా ముఖ్యమైన సీన్ ఒకటి షూటింగ్ వదిలేసుకొని మరీ వచ్చి తనను కలిసినట్లు వివరించారు. తనకోసం అంత కీలకమైన షూటింగ్ వదిలేసి రావడంపై తులసి ఆశ్చర్యం వ్యక్తం చేయగా ...అలా అనుకోవద్దని తాను బాగోగులను చూసుకుంటానని ఎన్టీఆర్ మాట ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమావేశం నాటికి తను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు తారక్ తో నటించలేదని అయినప్పటికీ అంత శ్రద్ధ తీసుకొని వచ్చి మరీ తనతో సమావేశమయ్యారని తులసి వివరించారు. తారక్ తనతో భేటీ అయినప్పుడు కంటిలో వచ్చిన తడిని కూడా గమనించారని తెలిపారు.
``మనసులో ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, తన సహాయం ఉన్నవారికి అండగా నిలబడటం, పద్దతిగా వ్యవహరించడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం.....ఇలాంటి ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఎన్టీఆర్ సొంతం. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న ఎన్టీఆర్ కేవలం నటుడిగానే మిగిలిపోడు...ఉన్నత స్థానాలకు ఎదుగుతాడు. మహనీయుడు అవుతాడు`` అని తులసి ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/