మహేష్ వసుమతి వచ్చేసింది

Update: 2018-05-11 17:12 GMT

2018 టాలీవుడ్ లో చేదు అనుభవాలతో పాటు బాక్స్ ఆఫీస్ అనుభూతులు కూడా బాగానే రిపీట్ అవుతున్నాయి. చెత్త విషయాల గురించి పక్కనపెడితే.. కష్టపడి తీసే సినిమాలు అడకుంటే ఎంత మంది జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. పెద్ద సినిమాలు ఆడితేనే ఇండస్ట్రీకి హోదా పెరుగుతుంది. ఇక ఇటీవల వచ్చిన రంగస్థలం నుంచి వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుతుండడం మంచి పరిణామమని చెప్పాలి.

మెయిన్ గా భరత్ అనే నేను సినిమా సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. కలెక్షన్స్ పరంగా ఇప్పటికే 200 కోట్ల బాక్స్ ఆఫీస్ ని క్రాస్ చేసిన ఆ సినిమా మహేష్ కెరీర్ లోనే మంచి చిత్రంగా నిలిచింది. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ ఏ మాత్రం ఆపడం లేదు. సినిమాకు సంబంధించిన ఎదో ఒక విషయాన్ని ఇంకా జనాల హృదయాల్లో మెదిలేలా చేస్తోంది. రీసెంట్ గా వసుమతి వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ముందుగా ఈ సాంగ్ ని ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ లో రిలీజ్ చేయగా అనంతరం యూ ట్యూబ్ లో రిలీజ్ చేశారు.

సోషల్ మీడియాలో మహేష్ బాబుకు సంబంధించిన ఎలాంటి న్యూస్ వచ్చినా ట్రెండ్ అవుతున్న సమయంలో సినిమాలో అందరికి నచ్చిన పాటను రిలీజ్ చేయడంతో అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News