భరత్ అనే నేను విడుదలకు సరిగ్గా పది రోజులు మాత్రమే ఉంది. ప్రిన్స్ ఫాన్స్ ఈ రోజులు ఎప్పుడు గడుస్తాయా చీఫ్ మినిస్టర్ భరత్ ని వెండితెరపై చూసుకుని ఎప్పుడెప్పుడు మురిసిపోతామా అని ఎదురు చూస్తున్నారు. బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన ట్రైలర్ ఇప్పటికీ అంచనాలు నిలబెట్టుకోగా ఆన్ లైన్ లో ఉన్న ఫుల్ ఆల్బం టాప్ చార్ట్స్ లో ఉంది. టైటిల్ సాంగ్ తో పాటు వచ్చాడయ్యో సామీ గతంలోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు వీటి సరసన మరో పాట కూడా చేరేలా ఉంది. అదే ఓ వసుమతి. స్లో మెలోడీ అనిపించేలా స్టార్ట్ చేసి మెల్లగా బీట్స్ తో పీక్స్ తీసుకెళ్ళి ‘దేవదారు శిల్పంలా మెరిసిపోయే ప్రియురాలా ప్రేమ కవితల షెల్లీలా మారిపోయా నీ వల్లా’ అంటూ భరత్ పొగిడితే దానికి బదులుగా ‘ప్రపంచమేలు నాయకా ఇదేగా నీకు తీరికా మనసు దోచింది నీ పోలికా’ అంటూ తానేమి తక్కువ తినలేదు వసుమతి అన్నట్టు పాడటం బాగా కనెక్ట్ అయ్యింది.
రామజోగయ్య శాస్త్రి పదాలతో చేసిన గమ్మత్తు పాటను ఇంకో లెవెల్ కు తీసుకెళ్లగా స్లో పాయిజన్ లాగా దేవి ఇచ్చిన ట్యూన్ చాలా క్యాచీగా ఉంది. సూర్య చంద్రులతో మాట్లాడి గంటలు పెంచడం-విమానమంత పల్లకిని తేవడం రోదసిని మార్చడం లాంటి ఎన్నో ప్రయోగాలు ఇందులో ఉన్నాయి. కాస్త రెగ్యులర్ టచ్ ఉన్న ట్యూన్ లాగా తొలుత అనిపించినా తర్వాత నోట్లో అదే పనిగా ఆడేలా దేవి చేసిన కనికట్టు గతంలో లాగే ఇప్పుడు కూడా బాగా వర్క్ అవుట్ అయ్యేలా ఆంది. పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీకి తగ్గ ఆల్బంనే చేయించుకున్నాడు కొరటాల శివ. హోరేత్తిపోయే సంగీతంతో కాకుండా చక్కని మెలోడీస్ తో పాటు ఇలాంటి పెప్పి నంబర్స్ కూడా ఇందులో ఉండటంతో ప్రిన్స్ ఫాన్స్ ఖుషిగా ఉన్నారు. ఏప్రిల్ 20 విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక్క యుఎస్ లోనే మొదటి రోజు 2000 షోలు వేయబోతున్నారు. అది భరత్ స్టామినా.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View