పాత సినిమాలతో పొద్దు పుచ్చుతున్నారే

Update: 2017-02-22 00:30 GMT
ఈ ఏడాది ప్రారంభం నుంచి బాక్సాఫీస్ కళకళలాడి పోయింది. ఆ మాటకొస్తే డిసెంబర్ ప్రారంభంలో ధృవ రిలీజ్ అయినప్పటి నుంచి వరుసగా సినిమాలు సందడి చేస్తున్నాయి. సంక్రాంతికి అయితే.. రిలీజ్ అయిన సినిమాలన్నీ(కానిస్టేబుల్ వెంకట్రామయ్య తప్ప) బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి.

ఆ తర్వాత ఫిబ్రవరి ప్రారంభం కూడా టాలీవుడ్ కి బాగానే నడించింది. నాని మూవీ నేను లోకల్ కూడా బ్లాక్ బస్టర్ అయిపోవడంతో.. థియేటర్లు కళకళలాడిపోయాయి. కానీ ఇప్పుడు సిట్యుయేషన్ మారిపోయింది. ఘాజీ.. నేను లోకల్ మినహాయిస్తే.. కొత్త సినిమాలేవీ లేవు. ఉన్నవాటికి థియేటర్లను నింపే కెపాసిటీ లేదు. అంతకు ముందు వారంలో వచ్చిన ఎస్3.. ఓం నమో వెంకటేశాయ జనాలను ఆకట్టుకోలేకపోవడమే ఇందుకు కారణం.

ఇప్పుడు.. అ..ఆ.. బాహుబలి ది బిగినింగ్.. ధృవ.. ఎక్కడికి పోతావు చిన్నవాడు.. జనతా గ్యారేజ్.. ఖైదీ నం. 150.. సర్దార్ గబ్బర్ సింగ్.. సరైనోడు.. సోగ్గాడే చిన్ని నాయన చిత్రాలను కూడా పలు మల్టీప్లెక్సులు.. సింగిల్ స్క్రీన్లలో తిరిగి రన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదురవడం ఇదే మొదటిసారి. ఈ వారం విన్నర్ మూవీ రిలీజ్ అవుతున్నా.. అన్ని థియేటర్లను నింపేసే రేంజ్ కాదు. వచ్చే నెలాఖర్లో విడుదల కానున్న కాటమరాయుడు.. థియేటర్లలోకి వచ్చేవరకూ సినిమా థియేటర్ల పరిస్థితి ఇలాగే ఉండొచ్చంటున్నారు ట్రేడ్ జనాలు.
Tags:    

Similar News