టీవీల్లో రియాల్టీ షోలు చేసుకునేవాడికి సినిమాల డైరెక్షన్ అవసరమా అంటూ మొన్నటిదాకా అందరూ వేళాకోళం చేశారు కానీ.. ఇప్పుడు అతడే టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాడు. ‘రాజు గారి గది’ మంచి విజయం సాధించడమే కాక.. నాలుగైదు రోజులకే బయ్యర్లందరికీ లాభాలు తెచ్చిపెట్టడంతో ఓంకార్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు. ‘రాజు గారి గది’ సినిమా మీద నమ్మకంతో విడుదలకు ముందే సాయి కొర్రపాటితో కలిసి హోల్ సేల్ గా సినిమాను కొనేసిన నిర్మాత అనిల్ సుంకర.. ఓంకార్ తో ఓ సినిమా నిర్మించడానికి రెడీ అయిపోయాడు.
ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బేనర్ లో ఓంకార్ తో అనిల్ సుంకర సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. తన దగ్గర రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని.. ‘రాజు గారి గది’ ఫలితాన్ని బట్టి వాటిని తెరకెక్కిస్తానని ఓంకార్ ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఆ రెంటిలో ఒకటి ఫ్యామిలీ ఎమోషన్స్ మీద నడిచే కామెడీ సినిమా కాగా.. ఇంకోటి ‘రాజు గారి గది’కి సీక్వెల్. ముందే ఫ్యామలీ సినిమా చేసి... ఆ తర్వాత సీక్వెల్ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. కాబట్టి అనిల్ సుంకరతో చేసే సినిమా అదే కావచ్చు. కేవలం రూ.1.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ‘రాజు గారి గది’ ఇప్పటికే రూ.2.5 కోట్ల దాకా వసూలు చేసినట్లు అంచనా.