బుల్లితెర యాంకర్ ఓంకార్ కు అభిమానులు ఎంతమంది ఉన్నారో.. అతణ్ని వ్యతిరేకించే వాళ్లు దానికి రెట్టింపు స్థాయిలో ఉంటారు. ఆట డ్యాన్స్ షోలో విపరీతమైన ‘డ్రామాలు’ క్రియేట్ చేసి దాన్ని సూపర్ హిట్ చేయడం ద్వారా... మిగతా రియాల్టీ షోలన్నీ కూడా ఈ బాటలోనే సాగేలా చేసి బుల్లితెరను భ్రష్టు పట్టించాడని అతడికి మహా చెడ్డ పేరుంది. యూట్యూబ్ లోకి వెళ్తే ఓంకార్ మీద లెక్కలేనన్ని స్పూఫులు, సెటైరిక్ వీడియోలు ఉంటాయి. ఐతే తనను తిట్టిపోసినా, వ్యతిరేకించినా.. అది కూడా ఒకరకంగా పబ్లిసిటీయే అనుకుంటూ ముందుకు దూసుకెళ్లిపోయాడు ఓంకార్. బుల్లితెరపై అతను చేసిన మిగతా షోలు కూడా హిట్టయ్యాయి. ఆ ఊపులో వెండితెరను కూడా ఏలేద్దామని వచ్చాడు. కానీ ‘జీనియస్’ అతడి ఆశలకు పెద్ద బ్రేక్ వేసింది.
జీనియస్ అంత పెద్ద ఫ్లాప్ అయినా.. ఓంకార్ మళ్లీ ఓ సినిమా తీయగలగడం.. దాన్ని బాగా ప్రమోట్ చేసి మంచి క్రేజ్ మధ్య విడుదల చేయడం గొప్ప విషయమే. దసరాకు గట్టి పోటీ మధ్య విడుదలైంది ఓంకార్ కొత్త సినిమా ‘రాజు గారి గది’. ఐతే సినిమాకు మంచి టాకే వస్తోంది. తెలుగు ప్రేక్షకులు హార్రర్ కామెడీకి పట్టం కడుతున్న విషయాన్ని గ్రహించి.. తనకు అచ్చొచ్చిన రియాల్టీ షో కాన్సెప్టుకే కామెడీ-హార్రర్ జత చేసి.. డైరెక్టర్ గా సక్సెస్ అయిపోయాడు ఓంకార్. రొటీన్ అన్న అభిప్రాయం ఉన్నప్పటికీ కామెడీ వర్కవుటైపోవడంతో ‘రాజు గారి గది’ బాక్సాఫీస్ ప్రయాణం సాఫీగా సాగిపోతోంది. దసరా పోటీలో ఉన్న మిగతా సినిమాలకు లేని అడ్వాంటేజి ‘రాజు గారి గది’కి ఉండటం పెద్ద ప్లస్ అయింది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలేవీ కూడా సరైన మాస్ కామెడీ అందించలేదు. ఆ లోటు ‘రాజు గారి గది’ తీర్చేస్తుండటంతో బి - సి సెంటర్లలో హవా సాగిస్తోంది. పెట్టుబడి చాలా తక్కువ కాబట్టి ఈ సినిమా బయ్యర్లకు భారీ లాభాలు మిగిల్చేలా కనిపిస్తోంది.