సరే.. ఇప్పుడు రిలీజ్ అయ్యే సినిమా కనుక హిట్టయితే ఈసారి ఓ స్టార్ హీరోతో చేస్తానని చెప్పాడు. రాజు గారి గదితో సుడి తిరిగింది. సినిమా హిట్టయ్యింది. డబ్బులొస్తున్నాయ్. కాని నిజంగానే ఓంకార్ వెంటనే ఎవరైనా స్టార్ హీరోతో సినిమాను చేస్తాడా? ఇదే అతి పెద్ద క్వశ్చన్.
గబ్బర్ సింగ్ వంటి పెద్ద బ్లాక్ బస్టర్ ను కొడితే కాని ఎన్టీఆర్ వంటి బడా స్టార్ హరీశ్ శంకర్ కు ఛాన్సివ్వల్లేదు. అలాగే మిరపకాయ్ తో హిట్టు కొట్టాకనే పవన్ కూడా హరీశ్ ను ఓకె చేశాడు. ఇకపోతే మిర్చి సినిమాతో భారీ హిట్టు కొట్టినా కూడా కొరటాల శివ రెండో సినిమా కోసం ఏకంగా ఒకటిన్నర సంవత్సరం వెయిట్ చేయాల్సి వచ్చింది. సంపత్ నంది రచ్చ సినిమాతో మాంచి హిట్టే కొట్టినా.. పవన్ తో సినిమా అంటూ దాదాపు రెండేళ్ళు పూర్తిగా వెయిటింగ్ లోనే గడిపేశాడు. వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ఓంకార్ కు ఎంత ఫాస్టుగా ఒక పెద్ద హీరో సినిమా పడుతుంది అనేది మరి వేచి చూడాల్సిన అంశమే.
ఇకపోతే ప్రస్తుతం తన సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఓంకార్.. సినిమాను ఇంకా ప్రమోట్ చేస్తూ ఆడియన్సుకు థ్యాంక్స్ చెప్పడానికి సక్సెస్ టూర్ లో బిజీగా ఉన్నాడు. అది సంగతి.