మరోసారి అభిమాన సంఘాల నాయకులతో రజినీ భేటీ .. ఆ ఇద్దరు కూడా హాజరైయ్యారు !

Update: 2020-12-09 11:41 GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై ఈ మద్యే ఓ క్లారిటీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మద్యే అభిమాన సంఘాలతో భేటీ అయ్యి రాజకీయాల్లోకి పక్కా వస్తానని రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు రజనీకాంత్ మరోసారి చెన్నైలోని కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమాన సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సారి సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు మరో ఇద్దరు ప్రముఖులు అభిమాన సంఘాల నాయకులు. తలైవా సన్నిహితులతో క్షుణ్ణంగా చర్చించి మనం ఏం చెయ్యాలి అని చర్చలు జరుపుతున్నారు.

రజనీ అత్యంత సన్నిహితుడు అర్జున మూర్తితో పాటు తమిళ్రూవి మణియన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక గతం లో జరిగిన భేటీలో తన అభిమాన సంఘాల నాయకులు వారివారి జిల్లాల్లోని పరిస్థితుల గురించి, అభిమానుల ఆకాంక్ష గురించి తనకు వివరించారని రజనీకాంత్ అన్నారు. అభిమానుల ఆశయాలకు అనుగునంగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, కచ్చితంగా తమిళ ప్రజలకు సేవ చేస్తానని తలైవా రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం డిసెంబర్ 31వ తేదీన తాను పక్కా రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ చెప్పినా 2020 డిసెంబర్ వరకు ఆ శుభముహూర్తానికి సమయం కలిసిరాలేదు. తనకు కిడ్నీ మార్పిడి జరిగిందని, అనారోగ్యంతో ప్రజలకు న్యాయం చెయ్యలేనని ఆందోళనతో ఇంతకాలం రాజకీయాల గురించి పట్టించుకోలేదని, ఇదే సమయంలో కరోనా వ్యాధి విరుచుకుపడటంతో అంటువ్యాధుల భయంతో రాజకీయాలకు దూరం అయ్యానని, ఇక ఆలస్యం చెయ్యనని రజనీకాంత్ వివరణ ఇచ్చారు.



Tags:    

Similar News