30 జూలై 2020 బిగ్ డేకి స‌రిగ్గా ఏడాది!

Update: 2019-07-30 17:58 GMT
30 జూలై 2019 నేడు.. స‌రిగ్గా ఏడాది ఉంది బిగ్ డేకి. 30 జూలై 2020 రావ‌డానికి స‌రిగ్గా ఏడాది స‌మ‌యం ఉంది. ఆ రోజు ప్ర‌త్యేక‌త ఏంటో విడిగా చెప్పాల్సిన ప‌నే లేదు. 2020 ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ తేదీ ఇది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ముందే ఫిక్స్ చేసిన ఈ తేదీ కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఆరోజు బాహుబ‌లి రికార్డుల‌న్నీ బ్రేక్ అవుతాయా లేదా?  జ‌క్క‌న్న డ్రీమ్ ప్రాజెక్ట్ ఎలాంటి సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది? అన్న ఉత్కంఠ అంద‌రిలో ఉంది. రామ్ చ‌ర‌ణ్ .. తారక్ ఇద్ద‌రికీ ఆ రోజు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. ప్ర‌స్తుతం ఈ సినిమా కీల‌క షెడ్యూల్ హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో తెర‌కెక్కుతోంది. తారక్.. చ‌ర‌ణ్ ల‌పై కీల‌క స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తున్నారు.

డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లూరి సీతా రామ‌రాజుగా రామ్ చ‌ర‌ణ్.. కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం ఆంగ్లేయుల్ని ఎదురించిన ఆ ఇద్ద‌రూ క‌లిసి పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది? అన్న ఫిక్ష‌న్ క‌థ‌తో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలోనూ వీఎఫ్ ఎక్స్ మాయాజాలం కీల‌క పాత్ర పోషించ‌నుంది. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ ప్రీరిలీజ్ బిజినెస్ లోనూ దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News