అక్కినేని నాగార్జున డ్రీమ్ రన్ కంటిన్యూ అవుతోంది. ‘మనం’ సినిమాతో మనసులు దోచి.. ‘సోగ్గాడే చిన్నినాయనా’తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాగ్.. ‘ఊపిరి’ మూవీతో రెండు రకాలుగానూ మెప్పిస్తున్నాడు. టాలీవుడ్లో ఈ మధ్య ఏ చిత్రానికీ రానన్ని ప్రశంసలు అందుకున్న ఈ సినిమా మూడో వారంలోనూ మంచి కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మేనియాతో ‘ఊపిరి’కి పంచ్ పడుతుందని అంతా అనుకున్నారు కానీ.. ఆ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో తర్వాతి రోజు నుంచే ‘ఊపిరి’ మళ్లీ జోరందుకుంది. థర్డ్ వీకెండ్ లో కూడా ‘ఊపిరి’ రెండు తెలుగు రాష్ట్రాల్లో.. యుఎస్ లో మంచి కలెక్షన్లు సాధించింది. యుఎస్ లో మనం సినిమా నెలకొల్పిన రికార్డును కూడా ‘ఊపిరి’ దాటేసింది.
రెండేళ్ల కిందట ‘మనం’ 1.54 మిలియన్ డాలర్లతో యుఎస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన నాగార్జున సినిమాగా రికార్డు సృష్టించింది. ఆ రికార్డును ‘ఊపిరి’ దాటేసింది. ప్రస్తుతం ‘ఊపిరి’ యుఎస్ కలెక్షన్లు 1.56 మిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ‘సర్దార్..’ జోరు తగ్గిపోవడం.. ఈ వారం చెప్పుకోదగ్గ రిలీజ్ ఏమీ లేకపోవడంతో యుఎస్ లో ‘ఊపిరి’ డ్రీమ్ రన్ కంటిన్యూ అయ్యేలాగే ఉంది. మంచు విష్ణు-రాజ్ తరుణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఈడోరకం ఆడోరకం’ యుఎస్ లో నామమాత్రంగా.. 14 లొకేషన్లలో మాత్రమే విడుదలవుతోంది. ఐతే ‘ఊపిరి’ మాత్రం ఇంకా అక్కడ దాదాపు 70 లొకేషన్లలో ఆడుతోంది. ఫుల్ రన్ లో 2 మిలియన్ మార్కును అందుకోలేకపోయినా.. 1.75 మిలియన్ల దాకా వసూళ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.