నాగార్జున - కార్తీలు హీరోలుగా వంశీ పైడిపల్లి రూపొందించిన చిత్రం ఊపిరి. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 వారాలు గడుస్తున్నా.. ఇంకా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మల్టీప్లెక్స్ - ఏ క్లాస్ సెంటర్లలో ఊపిరి హంగామా స్ట్రాంగ్ గానే ఉంది. ఇండియన్ మార్కెట్ లో చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించిన ఊపిరి.. ఓవర్సీస్ లో ఇప్పటికే 1.5 మిలియన్ డాలర్ల మార్కును అధిగమించి, అక్కడ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.
ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన శాటిలైట్ రైట్స్ ను సన్ నెట్వర్క్ సొంతం చేసుకుంది. సాధారణంగా నాగ్ చిత్రాలకు వచ్చే శాటిలైట్ మొత్తం కంటే రెట్టింపు చెల్లించి మరీ ఊపిరి శాటిలైట్ రైట్స్ కొనుగోలు చేయడం విశేషం. ఈ చిత్రానికి ఏకంగా 14 కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు సన్ నెట్వర్క్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తెలుగు - తమిళ్ వెర్షన్లకు కలిపి ఈ అమౌంట్ చెల్లించనున్నారు. మార్కెట్ పరంగా భారీ బ్లాక్ బస్టర్ సాధించిన చిత్రాలకు కూడా ఇంత మొత్తం శాటిలైట్ ద్వారా రావడం కష్టం. కానీ ఊపిరి విషయంలో మాత్రం టీవీ ఛానళ్లు ఫుల్లు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి.
నాగ్ వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తుండడం.. ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కావడం.. సందేశంతో పాటు ఎమోషన్స్ ను కూడా క్యారీ చేయడంతోనే.. ఊపిరికి 14 కోట్ల మొత్తం లభించిందని అంటున్నారు. ఇక.. ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు సాధిస్తుండడంతో.. ఊపిరి మరిన్ని రికార్డులు నెలకొల్పే అవకాశం ఉంది.