ట్రైల‌ర్ టాక్ : క్రిస్టోఫ‌ర్ నోల‌న్ మ‌రో వండ‌ర్ 'ఓపెన్ హైమ‌ర్‌'

Update: 2022-12-19 11:33 GMT
హాలీవుడ్ లో అడ్వాన్స్డ్ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన క్రేజీ మేక‌ర్ క్రిస్టోఫ‌ర్ నోల‌న్ మ‌రో వండ‌ర్ కు తెర‌లేపాడు. మెమెంటో, బ్యాట్ మెన్ సిరీస్ మూవీస్‌.. ది ప్రెజ్టీజ్‌, ఇన్ పెప్ష‌న్‌, డంకిర్క్‌, ఇంట‌ర్ స్టెల్లార్ వంటి సినిమాల‌తో వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నం సృష్టించారు. ఇటీవ‌ల 'లెనెట్' మూవీతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించిన నోల‌న్ తాజాగా ఆటం బాంబ్ సృష్టిక‌ర్త రాబ‌ర్త్ ఓపెన్ హైమ‌ర్ జీవిత క‌థ ఆధారంగా 'ఓపెన్ హైమ‌ర్' పేరుతో బ‌యోపిక్ కి శ్రీ‌కారం చుట్టాడు.

సిలియ‌న్ మ‌ర్ఫీ, ఎమీలీ బ్లంట్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. థ్రిల్ల‌ర్ క‌థాంశం నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో సిలిమ‌న్ మ‌ర్ఫీ అణు బాంబును క‌నిపెట్టిన అమెరిక‌న్ భౌతిక శాస్త్ర‌వేత్త జె. రాబ‌ర్ట్ ఒపెన్ హైమ‌ర్ పాత్ర‌లో సైంటిస్ట్ గా క‌నిపించ‌బోతున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్ తో క్రేజీ కాస్టింగ్ తో రూపొందుతున్న ఈ బ‌యోగ్రాఫిక‌ల్ డ్రామాకు సంబంధించిన ఫ‌స్ట్ ట్రైల‌ర్ ని సోమ‌వారం విడుద‌ల చేశారు. ఎమ్మ థామ‌స్‌, ఛార్లెస్ రోవెన్ నిర్మిస్తున్నారు.

'వీ ఇమాజిన్ ఏ ఫ్యూచ‌ర్‌..' అనే డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ట్రైల‌ర్ ని బ‌ట్టి స్పెల్ బౌండింగ్ విజువ‌ల్స్ తో అత్యంత తెలివైన‌.. స‌మ‌స్యాత్మ‌క‌మైన అణు శాస్త్ర‌వేత్త చుట్టూ తిరిగే థ్రిల్ల‌ర్ గా ఈ మూవీ సాగ‌నుంద‌ని తెలుస్తోంది. అణుశాస్త్ర వేత్త అయిన ఓపెన్ హైమ‌ర్ ఈ ప్ర‌పంచ వినాశ‌నం కోసం ఏం చేశాడు? .. ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్ని ఎదుర్కొన్నాడ‌నే ఆస‌క్తిక‌ర‌మైన క‌థా క‌థ‌నాల‌తో క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.

త‌న ప్ర‌తీ సినిమాని ఓ విజువ‌ల్ ఎక్సావ‌గాంజాగా తెర‌కెక్కించే నోల‌న్ ఈ మూవీకి కూడా అదే ఫార్ములాని వాడిన‌ట్టుగా తెలుస్తోంది. వ‌ర‌ల్డ్ క్లాస్ ఐమాక్స్ కెమెరాల‌తో అత్యుత స్థాయి ప్ర‌మాణాల‌తో అబ్భుర ప‌రిచే విజువ‌ల్స్ తో ఈ త‌ర‌హా సినిమాల‌ని తెర‌కెక్కించ‌డంతో త‌న‌కు తానే సాటి అని మరో సారి నిరూపించుకోబోతున్న‌ట్టుగా ఈ మూవీ ట్రైల‌ర్ వుంది. ట్రైల‌ర్ లోని విజువ‌ల్స్ ని చూసిన ప్ర‌తీ ఒక్క‌రినీ సినిమా చూడాల‌నే ఆస‌క్తిని క‌లిగిస్తోంది. లుడ్విన్ గోరాన్స‌న్ సంగీతం అందించిన ఈ మూవీని 2023 జూలై 21న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Full View

Tags:    

Similar News