సీనియర్స్‌ వద్దే వద్దనుకుంటున్న 'వర్మ'

Update: 2019-02-17 11:16 GMT
'అర్జున్‌ రెడ్డి' మూవీ తమిళ రీమేక్‌ 'వర్మ' ఫ్రెష్‌ గా రీ షూట్‌ చేయబోతున్న విషయం తెల్సిందే. సీనియర్‌ దర్శకుడు బాల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఆయన ఒరిజినల్‌ ఫ్లేవర్‌ మిస్‌ చేశాడంటూ మొత్తం ఫుటేజ్‌ ను పక్కకు పెట్టేశారు. ఇప్పుడు వర్మను ఎవరి చేతిలో పెడతారా అంటూ తమిళ సినీ ఇండస్ట్రీతో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో ఈ రీమేక్‌ ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే లవ్‌ స్టోరీస్‌ ను ఆకట్టుకునేవిధంగా తెరకెక్కించే గౌతమ్‌ మీనన్‌ కు ఈ రీమేక్‌ బాధ్యతలు అప్పగిస్తే మొత్తం మార్చేసే అవకాశం ఉందని భావిస్తున్నారట.

తెలుగులో 'అర్జున్‌ రెడ్డి' ఎలా అయితే ఉంటుందో అదే ఫీల్‌ తో తమిళంలో కూడా రూపొందించాలని హీరో విక్రమ్‌ భావిస్తున్నాడు. తన కొడుకు ధృవ్‌ కు మొదటి సినిమాతోనే సక్సెస్‌ ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో విక్రమ్‌ చాలా కష్టపడుతున్నాడు. అర్జున్‌ రెడ్డి ఫీల్‌ పోకుండా సినిమా తీయాలంటే సందీప్‌ వంగ అయితేనే బెటర్‌ అనే నిర్ణయానికి వచ్చారట. అయితే ప్రస్తుతం హిందీ రీమేక్‌ బిజీలో ఆయన ఉన్నాడు. దాంతో ఆయన సలహా ప్రకారం అర్జున్‌ రెడ్డి సినిమాకు వర్క్‌ చేసిన గిరీశయ్య ను వర్మకు సెట్‌ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

'అర్జున్‌ రెడ్డి' మేకింగ్‌ లో గిరీశయ్య కీలక పాత్ర పోషించాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ నుండి ఫైనల్‌ ఎడిటింగ్‌ వరకు సందీప్‌ వంగకు తోడుగా ఉండి అన్నింటిలో కూడా భాగస్వామ్యం అయ్యాడట. అందుకే గిరీశయ్యను ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌ బ్యూటీ బనిత సందును హీరోయిన్‌ గా ఇప్పటికే ఎంపిక చేశారు. మరి కొన్ని రోజుల్లో మళ్లీ వర్మ పట్టాలెక్కే అవకాశం ఉంది. ధృవ్‌ లుక్‌ ను కూడా ఈ సారి మారుస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మరికొన్ని రోజుల్లో నిర్మాణ సంస్థ నుండి అధికారికంగా వచ్చే అవకాశం ఉంది.
Tags:    

Similar News