వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ మరణం వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? ప్రస్తుతం అభిమానుల మెదడును తొలిచేస్తున్ ప్రశ్న ఇది. ఇండస్ట్రీ ప్రముఖులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. బాలీవుడ్ లో సినీపెద్దల రాజకీయాల్ని తూర్పారబడుతూ రాజకీయాల్ని కుట్రలు కుతంత్రాల్ని బహిర్గతం చేస్తున్నారు.
వీటితో కంటే సుశాంత్ ఎఫైర్ల ప్రభావమే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు డిప్రెషన్ లోకి వెళ్లాడంటే ఎఫైర్ వికటించడం వల్లనేనని అనేవారు ఉన్నారు. ప్రేమకథలు సఫలం కాకపోవడం వల్ల కూడా అతడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విమర్శలు చేసిన వారు ఉన్నారు. అయితే నవంబర్ లో రియా చక్రవర్తితో సుశాంత్ పెళ్లికి సిద్ధమవుతున్నాడని వచ్చిన వార్తలు నిజమా కాదా? అనే సందేహం కలిగేలా రకరకాల ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
అసలు సుశాంత్ ఆత్మహత్యకు ముందు గత కొంతకాలంగా రియాతో మాట్లాడడం లేదుట. అతడి ఫోన్ నుంచి ఎలాంటి కాల్స్ రియాకు వెళ్లలేదని చెబుతున్నారు. సుశాంత్ రియా కంటే ముందే ఓ అందాల నటిని ప్రేమించాడు. ఆమెతో బ్రేకప్ అయ్యింది. తనకి నిశ్చితార్థం అయిన రెండు రోజులకే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆ ప్రేమ వైఫల్యం అతడిని ఎంతగానో బాధించిందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది.
మరోవైపు ఎవ్వర్ లేటెస్టుగా.. సుశాంత్ పీఏ దిశ సాలియా పేరు మరోసారి వార్తల్లోకొచ్చింది. దిశ సాలియాకు తనకు కాబోయే భర్తకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరి మధ్యా గొడవల్లో సుశాంత్ కలుగజేసుకున్నాడన్న ప్రచారం సాగుతోంది. ఆ జంటను కలిపేందుకు సాయం చేద్దామనుకున్న సమయంలో దిశ ఆత్మహత్య చేసుకోవడం సుశాంత్ ను తీవ్రంగా కలిచి వేసిందని అతడు ఆత్మహత్య చేసుకోవడానికి అది కూడా ఓ కారణమని చెబుతున్నారు. అయితే సుశాంత్ ఆత్మహత్య వెనక అసలు కారణం ఏమై ఉంటుంది? ఇది ఆత్మహత్యనా లేక హత్యనా? అన్నది పోలీసులే తేల్చాల్సి ఉంటుంది. ఇవన్నీ నెటిజనుల ఊహాగానాలు మాత్రమే.