ప్రైమ్ చేతికి SVP రైట్స్..ఎన్ని కోట్ల‌కో?

Update: 2022-05-12 07:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఓటీటీ మార్కెట్ మామూలుగా లేదు. థియేట్రిక‌ల్ రిలీజ్ కి పోటీగా ఓటీటీలోనూ సినిమా మార్కెట్ అవుతుంది. కోట్ల రూపాయ‌లు వెచ్చించి మ‌రీ ఓటీటీ రైట్స్ ద‌క్కించుకుంటున్నాయి. థియేట్రిక‌ల్ రిలీజ్ కి  ముందే ఆఫ‌ర్లు ప్ర‌క‌టించి మరీ ఓటీటీలు పోటీ ప‌డుతున్నాయి. ఇటీవ‌లే రిలీజ్ అయిన `ఆర్ ఆర్ ఆర్`..`ఆచార్య`.. `రాధేశ్యామ్` లాంటి సినిమాలు ఓటీటీలో భారీ ధ‌ర‌కు అమ్మ‌డుపోయిన సంగ‌తి తెలిసిందే.

థియేట‌ర్ రిజ‌ల్ట్ తో సంబంధం లేకుండా ఓటీటీలో రిలీజ్ చేసుకుని సినిమాని మార్కెట్ చేసుకోగ‌ల్గుతున్నారు. ఇక థియేట‌ర్ లో  స‌క్సెస్ అయిన సినిమా అయితేల ఓటీటీకి  అద‌న‌పు అడ్వాంటేజ్ గా మారుతుంది. ఎంట‌ర్ టైన్ మెంట్ కొత్త రూపం మార్చుకుంటుంది అన‌డానికి దీన్ని ఒక ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చు. మ‌రి ఓటీటీలో ఈ సినిమా  వ‌సూళ్ల ఫ‌లితాలు ఎలా ఉంటున్నాయి? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `స‌ర్కారు వారి పాట` కూడా భారీ ధ‌ర‌కి ఓటీటీ కి అమ్మ‌డు పోయినట్లు తెలుస్తోంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సిన‌మా హ‌క్కుల్ని ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. మ‌రి ఎన్ని కోట్ల‌కు రైట్స్ ద‌క్కించుకుంది? అన్న విషయం తెలియాల్సి  ఉంది. `స‌ర్కారు వారి పాట` నేడు వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే.

సినిమాకి పాజిటివ్ టాక్ వ‌స్తోంది. అభిమానుల మెచ్చిన సినిమాగా టాక్ స్ర్పెడ్ అవుతుంది. ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ అంశాలున్న సినిమా అని అంటున్నారు. మొత్తంగా ఎస్ వీపీకి థియేట‌ర్ టాక్ పాజిటివ్ గానే ఉంది. కాబ‌ట్టి ఓటీటీలో సినిమా గ‌ట్టెక్కిపోవ‌డం ఖాయ‌మ‌నే చెప్పొచ్చు. థియేట‌ర్ రిలీజ్ త‌ర్వాత కొన్ని వారాల త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యేలా అగ్రిమెంట్ ఉంటుంది.

మినిమంగా ఆరు వారాల  త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉంది. మ‌రి ఈ సినిమా అగ్రిమెంట్ ఎలా కుదిరింది అన్న‌ది చూడాలి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్-14 రీల్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో మ‌హేష్ కి జోడీగా కీర్తి సురేష్ న‌టించింది.  ఈ చిత్రానికి ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.
Tags:    

Similar News