మన రాజమౌళికి ఆ హాలీవుడ్ డైరక్టర్ ఫ్యాన్ అట..!

Update: 2022-11-21 08:31 GMT
తెలుగు సినిమాని ప్రపంచ నిలబెడుతున్న రాజమౌళి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. బాహుబలి తోనే తెలుగు సినిమా స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన జక్కన్న ఆర్.ఆర్.ఆర్ తో మరిన్ని సంచలనాలు సృష్టిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ ఖాతాలో ఎన్నో అవార్డులు ఉండగా కొత్తగా గవర్నర్స్ అవార్డ్ కూడా అందుకుంది.  ఆల్రెడీ బాహుబలి తో ఒకసారి ఈ అవార్డ్ తీసుకున్న రాజమౌళి మరోసారి ఆ అవార్డ్ దక్కించుకున్నాడు.

ఇంటర్నేషనల్ వేదిక మీద తెలుగు సినిమాని నిలబెట్టిన డైరెక్టర్ గా రాజమౌళి తన స్టామినా చూపిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ లకు ముందు జరిగే ఈ గవర్నర్స్ అవార్డుల్లో ఇంటర్నేషనల్ లెవల్లో ప్రముఖులను అవార్డులతో సత్కరిస్తారు.

ఈ వేడుకలో చాలామంది హాలీవుడ్ స్టార్స్, డైరక్టర్స్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు ఇండియా నుంచి రాజమౌళికి ఆ ఛాన్స్ దక్కింది. ఇంటర్నేషనల్ వేదిక కాబట్టి సూటు బూటుతో రాజమౌళి కూడా స్టైలిష్ లుక్ లో అవార్డు వేడుకలో పాల్గొన్నారు.

అక్కడ కలిసిన ఎంతోమంది రాజమౌళి ప్రతిభని మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే మిషన్ ఇంపాజిబుల్, స్టార్ వార్స్ డైరక్టర్ జెజె అబ్రామ్స్ కూడా రాజమౌళి ని పొగడ్తలతో ముంచెత్తాడు. సినిమా మేకింగ్ లో రాజమౌళికి తను ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు.

ఒక హాలీవుడ్ డైరెక్టర్ తాను రాజమౌళి ఫ్యాన్ అని చెప్పుకోవడం అతి పెద్ద అవార్డ్ అని చెప్పొచ్చు. రాజమౌళి ప్రతి సినిమాకు 3 ఏళ్ల దాకా టైం తీసుకుంటారు. కానీ ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుంది అన్నది ఇలాంటి అవార్డులు పొందినప్పుడే అర్థమవుతుంది. బాహుబలి తోనే తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన రాజమౌళి ప్రతి సినిమాకు ప్రపంచం మొత్తం టాలీవుడ్ వైపు చూసేలా చేస్తున్నారు.  

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు తమ నట విశ్వరూపం చూపించారు. రీసెంట్ గా జపాన్ లో గ్రాండ్ గా రిలీజైన ఆర్.ఆర్.ఆర్ అక్కడ కూడా వసూళ్లతో అదరగొట్టేస్తుంది. ఇప్పటికే 250 మిలియన్ యాన్ లతో బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయగా త్వరలో మరికొన్ని రికార్డులను కూడా బ్రేక్ చేసి ఆర్.ఆర్.ఆర్ మీద సరికొత్త రికార్డు నెలకొల్పేలా ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News