ఒవియా.. ఏడాది ముందు వరకు కోలీవుడ్లో ఒక చిన్న స్థాయి హీరోయిన్. తమిళంలో ఒకట్రెండు హిట్లున్నాయి కానీ.. అవి చిన్న సినిమాలే. ఆమె చేసినవన్నీ చిన్న-మీడియం రేంజ్ సినిమాలే. ఒక దశ దాటాక ఆ రేంజ్ సినిమాలు కూడా లేక ఖాళీ అయిపోయిందీ మలయాళ అమ్మాయి. అలాంటి సమయంలోనే తమిళ ‘బిగ్ బాస్’లో అవకాశం దక్కడం.. అందులో ఒవియా ప్రవర్తన.. యాటిట్యూడ్ జనాలకు విపరీతంగా నచ్చేసి లక్షలాది మంది ఆమె ఫాలోవర్లుగా మారిపోవడం.. తనకు విపరీతమైన పాపులారిటీ వచ్చేయడం.. ఇలా కొన్ని నెలల వ్యవధిలో ఒవియా జాతకమే మారిపోయింది. సోషల్ మీడియాలో ఒవియా ఫ్యాన్ ఫాలోయింగ్.. ఆమె క్రేజ్ చూస్తే షాకవ్వాల్సిందే. ‘బిగ్ బాస్’ నుంచి బయటికి వచ్చాక ఒవియాకు జనాదరణ కూడా అసాధారణంగా కనిపించింది.
ఒవియా రేంజ్ మారాక ముందుగా తన సినిమా రిలీజైంది తెలుగులోనే కావడం విశేషం. తరుణ్ హీరోగా నటించిన ‘ఇది నా లవ్ స్టోరీ’లో కథానాయికగా నటించింది ఒవియా. ఇది రెండేళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న సినిమా. ఒవియా పరిస్థితి ఏమంత బాగా లేనపుడు ఈ సినిమా ఒప్పుకుంది. ఈ సినిమా పరిస్థితేంటో అర్థమయ్యే ఏమో.. ప్రమోషన్లలో ఎక్కడా కనిపించలేదు. ఇక సినిమాలో ఒవియా ఏమైనా ప్రత్యేకత చాటుకుందా అంటే అదేమీ లేదు. తన పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. ఆమె లుక్స్.. నటన అన్నీ సామాన్యంగా అనిపించాయి. తరుణ్ పక్కన ఆమె ఏమాత్రం సూటవ్వలేదు. ముదురుగా అనిపించింది. ఐతే ఒవియా తమిళ అభిమానులు మాత్రం ‘ఇది నా లవ్ స్టోరీ’ రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో తెగ హడావుడి చేసేశారు. ‘టీఎఫ్ ఐ వెల్కమ్స్ ఒవియా’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ఇక్కడేదో అయిపోతున్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఇక్కడ ఒవియాను పట్టించుకున్న నాథుడు లేడని వారికెలా అర్థమవుతుంది?