పాకిస్థాన్ జనాలు, సినిమా పరిశ్రమ ఆధరించని పలువురు నటీమణులు ఇండియన్ స్క్రీన్ పై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెల్సిందే. పలువురు పాకిస్థానీ ముద్దుగుమ్మలు ఇండియన్ స్క్రీన్ పై తమదైన ముద్ర వేశారు. ట్యాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో పాకిస్థానీలు అయినా కూడా మన బాలీవుడ్ వారు వారిని ప్రోత్సహించారు. కాని ఇప్పుడు పాకిస్థాన్, ఇండియా మద్య గొడవ జరుగుతున్న సమయంలో వారు మాత్రం పాకిస్థాన్ వైపు నిలిచారు. సొంత దేశం అయినా న్యాయం వైపు నిలిస్తే బాగుంటుంది కదా అంటూ వారిని అభిమానించే ఇండియన్ ప్రేక్షకులు కోరుతున్నారు.
షారుఖ్ ఖాన్ చిత్రం 'రయీస్' చిత్రంలో హీరోయిన్ గా నటించిన పాకిస్థానీ బ్యూటీ మహిరా ఖాన్ కు ఇండియాలో మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి మహిరా ఖాన్ ఇండియాను తప్పుబడుతూ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ.. యుద్దంను కోరుకోవడం అనేది అమాయకత్వం - యద్దాన్ని కోరుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో ఒకసారి ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ పోస్ట్ చేసింది. ఇండియన్స్ ను కావాలని యుద్దం కోరుకుంటున్నట్లుగా మహిరా ఖాన్ వ్యాఖ్యలు ఉన్నాయి. శాంతి కోరుకుంటున్న పాకిస్థాన్ మీదకు ఇండియా యుద్దంకు వస్తుందా అంటూ కొందరు మహిరాను ప్రశ్నిస్తున్నారు. ఈ గొడవ మొదట ఎలా ప్రారంభం అయ్యిందో ఒకసారి నీకు నువ్వే ఆలోచించు అంటూ మరికొందరు మహిరకు సూచిస్తున్నారు.
పాకిస్థాన్ కు చెందినప్పటికి వీణామాలిక్ కు ఇండియాలోనే అత్యధికంగా క్రేజ్ ఉంది. అలాంటి వీణామాలిక్ ఎయిర్ ఫోర్స్ దాడుల నేపథ్యంలో ఇండియాపై వ్యంగ్యంగా కామెంట్ చేసింది. మై నేమ్ ఈజ్ ట్రీ.. ఐయామ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అంటూ పోస్ట్ చేసింది. మరో బాలీవుడ్ లో నటించిన పాకిస్థానీ ముద్దుగుమ్మ మావ్రా హోకెన్ కూడా ఇండియన్స్ కు వ్యతిరేకంగా మాట్లాడింది. ఇండియన్ మీడియా హద్దు మీరుతుందని - యుద్దంను కోరుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో నటించిన పలువురు పాకిస్థానీ హీరోయిన్స్ ఇప్పుడు భారత్ పై విమర్శలు చేస్తూ దిగజారుడు తనంకు పాల్పడుతున్నారు.