నెపోటిజంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. నటవారసుల్ని అస్సలు యాక్సెప్ట్ చేసేందుకు హిందీ ఆడియెన్ సిద్ధంగా లేరు. సుశాంత్ సింగ్ బలవన్మరణం అనంతరం ఇన్ సైడర్ ని దూరం పెట్టి ఔట్ సైడర్లను ఎంకరేజ్ చేసే ఒక సెక్షన్ సోషల్ మీడియాల్లో చేస్తున్న హంగామా చూస్తున్నదే. సరిగ్గా ఇలాంటి టైమ్ లో బాలీవుడ్ ఇన్ సైడర్ తో మహేష్ డైరెక్టర్ పరశురామ్ మంతనాలు సాగిస్తున్నారా? అంటే అవుననే సమాచారం.
సర్కార్ వారి పాట సినిమా కోసం పరశురామ్ తెలివైన గేమ్ ప్లాన్ చేస్తున్నారట. అయితే వ్వాట్టూడూ.. వాట్ నాట్టూడూ? అన్నది చూడలేదా? కపూర్లతో సమస్య లేదని భావిస్తున్నాడా? అన్న చర్చ మొదలైంది. పరశురామ్ మాత్రం మహేష్ సినిమాకి పాన్ ఇండియా కలరింగ్ అద్దుతున్న సన్నివేశం కనిపిస్తోంది. ఇరుగు పొరుగు భాషల మార్కెట్లను కొల్లగొట్టే విధంగా ప్లానింగ్ చేస్తున్నాడు. కన్నడ నుంచి కిచ్చా సుదీప్ ని బరిలో దించాడు. అలాగే బాలీవుడ్ నుంచి అనీల్ కపూర్ ని బరిలో దించితే హిందీ మార్కెట్ కి ప్లస్ అవుతుందని భావిస్తున్నాడు.
ఇటీవలే సీనియర్ కపూర్ కి స్క్రిప్టును కూడా వినిపించాడు. ఉపేంద్ర- కిచా సుదీప్ లతో పాటు అనీల్ కపూర్ పాత్ర ఇందులో కీలకంగా ఉంటుందని తెలిసింది. అయితే అనీల్ కపూర్ ఇంకా ఓకే చెప్పలేదని సమాచారం. సర్కార్ వారి పాట రెగ్యులర్ చిత్రీకరణ నవంబర్ నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి అప్పటికి స్టార్ కాస్ట్ అందరినీ రెడీ చేయాల్సి ఉంది. రెగ్యులర్ షూట్ నవంబర్ మొదటి వారం నుండి వాషింగ్టన్ డీసీలో ప్రారంభమవుతుంది.
ఇందులో కీర్తి సురేష్ ఒక నాయికగా నటిస్తుండగా వేరొక నాయికను ఎంపిక చేయనున్నారని సమాచారం. 2021 దసరా విడుదల లక్ష్యంగా చిత్రీకరణను పూర్తి చేస్తారట. మహేష్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించనుండగా.. మైత్రి మూవీ మేకర్స్- 14 రీల్స్ ప్లస్ -జిఎంబి ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అమెరికా షెడ్యూల్ తర్వాత ఇండియాలోనూ కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ సాగించనున్నారని సమాచారం.