విభిన్న చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న ధనుష్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో బిజీగా ఉన్నాడు. ధనుష్ తల్లిదండ్రుల విషయమై చాలాకాలంగా కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ధనుష్ తల్లిదండ్రులు ఎవరు అనేది ఒక కొలిక్కి రాకుండా పోతుంది. మేలూరుకు చెందిన కదిరేశన్ అనే వ్యక్తి ధనుష్ తన కుమారుడే అంటూ మొదటగా మేలూరులో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కొన్ని పరిణామాల ద్వారా ఈ కేసు మద్రాస్ కోర్టుకు చేరింది. కదిరేశన్ - మీనాక్షి దంపతులు ధనుష్ తమ కుమారుడే అని, చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయి వచ్చాడని ధనుష్ కోసం చాలా గట్టిగా పోరాడుతున్నారు. గతేడాది నుంచి ఈ కేసు విచారణ జరుగుతూనే ఉంది.
ధనుష్ తమ కుమారుడేనని - హీరోగా మారి మంచి పొజిషిన్ లో ఉన్నాడని - తమకు కూడా ఆర్థికంగా ధనుష్ అండగా ఉండాలని నెలకు కొంత మొత్తాన్ని తమకు ఇవ్వాలని కదిరేశన్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో భాగంగా ధనుష్ బర్త్ సర్టిఫికెట్, స్టడి సర్టిఫికెట్‌లను చూపించాలని కోర్టు ఆదేశించింది. ధనుష్ వాటిని సమర్పించడంతో కోర్టు ఈ కేసును కొట్టివేసింది. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ధనుష్ కోసం కదిరేశన్ దంపతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు.
ధనుష్ చూపించినా సర్టిఫికెట్స్ అన్నీ కూడా నకలి పత్రాలని - అందుకు ధనుష్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఈ విషయంలో తమకు న్యాయం జరిగేలా చూడాలని కదిరేశన్ దంపతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఈ కేసును స్వీకరించింది. నవంబర్ 9న కేసు విచారణకు రానుంది. ధనుష్ కోర్టులో సమర్పించిన పత్రాలు నిజంగా నకిలివేనా? ఒకవేళ నకిలి అయితే ఈ కేసు నుండి ఎలా బయట పడుతాడు అని అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధనుష్ తల్లిదండ్రుల విషయంలో ఒక క్లారిటీ లేక తరుచూ అభిమానులను భయాందోళలనలకు గురి చేస్తోంది. ఈ కేసు ధనుష్ కెరియర్‌పై ప్రభావం చూపుతుందా అని ఆవేదన చెందుతున్నారు.