ఫోటో స్టొరీ: జలపుష్పంలా పరిణీతి

Update: 2018-10-26 12:21 GMT
ప్రియాంక చోప్రా హాలీవుడ్డుకెళ్ళిందని.. నిక్కు ప్రేమలో పడి బాలీవుడ్ ఆడియన్స్ కు దూరమైందని చాలామంది బాధపడుతున్నారుగానీ ఆమె చెల్లి పరిణీతి చోప్రా మాత్రం అక్క లేని లోటుని తీరుస్తోంది.  అది సినిమాలు కావచ్చు.. హాటు హాటు అందాల ప్రదర్శనలు కావచ్చు.  మొదట్లో పరిణీతి కాస్త బొద్దుగా ఉండేదిగానీ తర్వాత నాజూగ్గా తయారయ్యి జీరో సైజ్ బ్యూటీ గా ఇతర హీరోయిన్లకు గట్టిగా కాంపిటీషన్ ఇస్తోంది.

అంతే కాదు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా పాపులర్. ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారంటే పరిణీతి జోరును మనం అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఒక ఫోటోను ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  స్విమ్మింగ్ పూల్ లో బికినీ అవతారంలో తేలుతూ శవాసనం వేసింది.  శవం.. ఆసనం అన్న పదాలు ఇక్కడ వాడడం అసందర్భమేమో గానీ బికినీ బ్యూటీ చేసిన పనిని అంతకంటే అందంగా చెప్పలంటే మాత్రం నీటిలో మాత్రమే ఉండే జలపుష్పంలా మారిపోయింది అని  మనం అనుకోవచ్చు. ఇక ఈ ఫోటో కు ఆమె ఇచ్చిన క్యాప్షన్ 'స్విచ్ ఆఫ్'.  

అమ్మడి బికినీ ఆసనానికి పిచ్చెక్కిన నెటిజనులు ఐదు గంటల్లోనే 3.8 లక్షల లైకులు కొట్టారు.  ఈ లైకులు షేర్ల సంగతి ఇలా ఉంటే ఈమధ్య ఆస్ట్రేలియన్ టూరిజం కి పరిణీతి బ్రాండ్ అంబాజిడర్ గా పనిచేసేందుకు ఒప్పందం చేసుకుందట.  అంటే మిమ్మల్ని పెర్త్.. సిడ్నీ.. కాన్ బెర్రా సిటీస్ తో పాటుగా ఆస్ట్రేలియాలో ఇతర  అందమైన లోకేషన్స్ కు రండి రండి రండి దయచేయండి అంటూ స్వాగతం పలుకుతుందన్నమాట!



Tags:    

Similar News