సోదరి ప్రియాంక చోప్రా పెళ్లిలో పరిణితి చోప్రా తెగ సందడి చేసిన విషయం తెల్సిందే. ప్రియాంక భర్త నిక్ తో సరదాగా సంగీత్ ఫంక్షన్ లో ఆటలు ఆడిన పరిణితి చోప్రా తెగ హడావుడి చేసింది. ప్రియాంక చోప్రా, నిక్ ల పెళ్లిలో పరిణితి చోప్రాతో పాటు ఎక్కువగా ఆమె పక్కనే చరిత్ దేశాయ్ కూడా కనిపించాడు. వీరిద్దరి గురించి చాలా రోజులుగానే మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు అంటూ బాలీవుడ్ మొత్తం అంతా తెలిసింది. ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ లో టాక్ ఉంది.
వీరిద్దరి ప్రేమ గురించి తాజాగా ఒక ప్రముఖ జాతీయ దిన పత్రికలో వార్త వచ్చింది. త్వరలోనే పరిణిత చోప్రా మరియు చరిత్ దేశాయ్ లు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారని, కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరు ఒక్కటి కాబోతున్నారు అంటూ సదరు కథనంలో పేర్కొనడం జరిగింది. అయితే ఆ కథనం పూర్తిగా అబద్దం అని, ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, తాను పెళ్లి చేసుకోబోతున్నప్పుడు తప్పకుండా సంతోషంగా ప్రకటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది.
చరిత్ దేశాయ్ తో ఈ అమ్మడి ప్రేమ విషయం అందరికి తెలిసింది. అయినా కూడా ఇంకా ఏం లేనట్లే ఆమె ప్రవర్తిస్తుంది. వారి ప్రేమపై ఇంకా వారికే నమ్మకం కలగలేదేమో అందుకే పెళ్లి విషయమై ఒక నిర్ణయానికి రాలేదేమో అంటూ కొందరు గుసగుసలాడుతున్నారు. సహాయ దర్శకుడిగా చరిత్ దేశాయ్ ఎన్నో చిత్రాలకు పని చేశాడు. అగ్నిపథ్ సినిమా సమయంలోనే వీరిద్దరికి పరిచయం అయినట్లుగా సమాచారం. అక్క పెళ్లి పీఠలు ఎక్కేసిన నేపథ్యంలో ఈ చెల్లి ఆ శుభ వార్తను ఎప్పుడు చెబుతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.