బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా చేతిలో ఇప్పుడు ఒకే ఒక సినిమా ఉంది. మేరీ ప్యారీ బిందు కోసం బాగానే కష్టపడుతోంది ఈ సుందరాంగి. అయితే.. సూపర్ స్టార్ మహేష్ బాబు-మురగదాస్ ల కాంబినేషన్ లో రూపొందే చిత్రం కోసం పరిణీతికి బాగానే ముట్టచెప్పారనే టాక్ ఉంది. అక్షరాలా మూడున్నర కోట్లు ఛార్జ్ చేసి టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది ఈ భామ.
ఇలా కోట్లు వసూలు చేయడం అమ్మడి కాన్సెప్ట్ కత్తిలా ఉంటుంది. రీసెంట్ గా టర్కీలో ఓ పెళ్లిలో కూడా డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చేసింది పరిణీతి. ఇదో హై ప్రొఫైల్ వెడ్డింగ్. అందుకే భారీ ఎత్తున ఖర్చు చేసి మరీ నిర్వహించిన పెళ్లిలో.. ఈ భామతోని డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇప్పించారు. పరిణీతి లాంటి హీరోయిన్ ఓ పెళ్లిలో డ్యాన్స్ వేయడమేంటని చాలా మంది అనుకున్నారు. అయితే ఆ పెళ్లి కూతురు ఈమెకు పెద్ద ఫ్యాన్ కావడంతో.. ఆ అమ్మాయి కోసమే ఇదంతా కవరేజ్ ఇస్తున్నారు.
అయితే అసలు విషయం మాత్రం వేరే ఉంది. ఆ ఒక్క డ్యాన్స్ పెర్ఫామెన్స్ కోసం కోటిన్నర వరకూ వసూలు చేసిందట పరిణీతి. ఆ మాట పైకి చెప్పకుండా పెళ్లి కూతురు.. ఫ్యాన్ అంటూ కవర్ చేస్తోంది. కోట్లు తీసుకుని పెర్ఫామెన్స్ లు ఇవ్వాలంటూ ఇప్పుడీ భామకు ఆఫర్లు బాగానే వస్తున్నాయట. మరి వాటిలో ఎన్నింటిని యాక్సెప్ట్ చేస్తుందో అప్పుడే చెప్పలేం.