నెవ్వర్ బిఫోర్ అన్న తీరుగానే చెలరేగిపోతోంది పారి అలియాస్ పరిణీతి చోప్రా. ఈ బొద్దుగుమ్మ ఏడాది కిందట ఊహించని విధంగా రూపం మార్చుకుని షాకిచ్చింది. `బొద్దుగుమ్మ` కాస్తా `ముద్దుగుమ్మ`గా మారింది. తనపై కామెంట్లను సీరియస్‌గా తీసుకుని తీరైన దేహశిరుల్ని సంపాదించేందుకు ఏడాది పాటు మాయమై, జిమ్ముల్లో కఠోరంగా శ్రమించింది. వన్ ఫైన్ డే బికినీకి పెర్ఫెక్ట్ ఫిట్ నా బాడీ!! అంటూ అభిమానుల ముందుకు కొత్త ఫోటోషూట్ తో దిగిపోయింది. కట్ చేస్తే పారీలో ఈ ఊహాతీతమైన మార్పు షాకిస్తోంది! అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో ఆ ఫోటోల్ని షేర్ చేశారు.
పారిలో ఇంతలోనే ఎంత మార్పు. ఇప్పుడు మరోసారి అదే తీరుగా చెలరేగిపోయింది. మరోసారి హాట్ ఫోటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. నిన్నటిరోజున ఇదిగో ఇదే నా ఫిలింఫేర్ ఫోటోషూట్ అంటూ సంబరంగా సామాజిక మాధ్యమాల్లో వేడెక్కించే ఫోటోల్ని షేర్ చేసింది పరిణీతి. తాజాగా మరో స్పెషల్ హిడెన్ ఫోటోని లీక్ చేసి అంతే వేడెక్కించింది.
ఈ ఫోటో సంథింగ్ స్పెషల్. ``పూల్ లో జలకాలాడుతున్న జలకన్య`` కాన్సెప్టుతో ఫ్లాష్ ని మెరిపించారు. ఇందులో పారి చింతపిక్క రంగు బికినీలో సలసలా కాగిపోయింది. టూపీస్ లో సెగలు పుట్టించింది. పెర్ఫెక్ట్ బికినీ బాడీ! అన్న వర్డ్ కి మీనింగ్ ఇదేనని మరోసారి ప్రూవ్ చేసింది. ఇంతకీ ఈ ఫోటోషూట్ చేసినది ఎవరో తెలుసా.. సెలబ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ అభయ్ సింగ్.. ఫిలింఫేర్ కోసమే ఈ తపనంతా! అంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఫోటోతో పాటు కామెంట్‌ని పోస్ట్ చేసింది. ఫిలింఫేర్ కవర్‌పేజీ పారి బికినీ లుక్‌తో హీటెక్కింది. ప్రస్తుతం పరిణీతి నటించిన `నమస్తే ఇంగ్లండ్` రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఆ క్రమంలోనే ఈ అమ్మడు కోస్టార్ అర్జున్ కపూర్ తో కలిసి ప్రచారం చేస్తోంది. అర్జున్ కి పారి పెర్ ఫెక్ట్ పెయిర్. అతడినే పెళ్లాడేస్తుందేమో! అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఒకానొక ప్రెస్మీట్లో `నాకు సరైన జోడీ పారి` అని మా మమ్మీ అంది అంటూ అర్జున్ కపూర్ సైతం హీట్ పెంచాడు. ప్రచారార్భాటంలో పంగనామం! అని సరిపెట్టుకోవాలో.. లేక బోనీ సన్ నిజంగానే పారీని ప్రేమిస్తున్నాడో అర్థంగాక ఫ్యాన్స్ బుర్రగోక్కుంటున్నారు ఇప్పటికి.