పిక్ టాక్ : అందాల బుట్టబొమ్మ గ్లామర్‌ హొయలు

తెలుగు ప్రేక్షకులకు ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే.

Update: 2024-09-20 11:16 GMT

తెలుగు ప్రేక్షకులకు ఒక లైలా కోసం, ముకుంద సినిమాలతో పరిచయం అయిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదటి రెండు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద హిట్‌ కొట్టలేదు. పైగా ఆ రెండు సినిమాల్లోనూ పూజా హెగ్డే నటనకు, అందానికి, గ్లామర్‌ కి పెద్దగా మార్కులు పడలేదు. దాంతో ఆ రెండు సినిమాలు టాలీవుడ్‌ లో ఆమెకు గుర్తింపును తెచ్చి పెట్టలేదు. ఆ రెండు సినిమాల తర్వాత దాదాపు రెండేళ్లు బాలీవుడ్‌ కి వెళ్లి పోయిన పూజా హెగ్డే రీ ఎంట్రీ లో అల్లు అర్జున్ కి జోడీగా 'డీజే' సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఒక్కసారిగా పూజా అందానికి అభిమానులు పెరిగి పోయారు.


డీజే సినిమాలో పూజా హెగ్డే చేసిన స్కిన్‌ షో ఒక్కసారిగా ఆమెను వార్తల్లో నిలపడం జరిగింది. అందాల ముద్దుగుమ్మ అంటూ అభిమానులు పిలుచుకుంటూ బుట్టబొమ్మ అంటూ అందరితో అనిపించుకున్న పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో సినిమాల పరంగా కాస్త స్లో అయింది. తిరిగి ఇండస్ట్రీలో బిజీ అవ్వడం కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తోంది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈమె సోషల్‌ మీడియాలో ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్‌ అవ్వడం కామన్ గా జరుగుతూ ఉంటుంది.


తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ అందాల ఫోటో షూట్స్ ఆకట్టుకుంటున్నాయి. అందమైన పూజా హెగ్డే అందంను మరింత పెంచే విధంగా ఈ ఔట్‌ ఫిట్ ఉందనే కామెంట్స్ కొందరు చేస్తూ ఉంటే, ఇంతటి అందగత్తెకు ఎందుకు ఆఫర్లు తగ్గాయి, సినిమాల్లో ఎందుకు ఇంత త్వరగా ఫేడ్‌ ఔట్ అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న పూజా హెగ్డే మళ్లీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ఇచ్చి బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగు తో పాటు ఇతర భాషల్లోనూ ప్రస్తుతం పూజా హెగ్డే చేస్తున్న సినిమాలు ఏమీ లేవు.


ఒకటి రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. వచ్చే ఏడాదిలో ఒక హిందీ సినిమా, ఒక తమిళ సినిమాతో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవి ఎంత వరకు వర్కౌట్‌ అవుతాయి అనేది క్లారిటీ లేదు. ముందు ముందు సినిమాల్లో పూజా హెగ్డే అందంతో పాటు అభినయంతో అలరించేందుకు గాను ప్రయత్నాలు చేస్తోంది. ఇతర హీరోయిన్స్ మాదిరిగా పూజా హెగ్డే సైతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేసేందుకు ఆసక్తిని కనబర్చుతోంది. మరి ఆ ఆఫర్లు అయినా ఈ అమ్మడికి దక్కేనా అనేది చూడాలి.

Tags:    

Similar News