బీజీఎమ్ బజాయించాలంటే మా నందమూరి తమనే!
తాజాగా రిలీజ్ అయిన `డాకు మహారాజ్` తోనూ మరోసారి అదే సన్నివేశం రిపీట్ అయింది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది.
నటసింహ బాలకృష్ణ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అంటే ఎంత అభిమానం అన్నది మాటల్లో చెప్పలేనిది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్-తమన్ పేర్లను ముందుచితే తమనే తనకంటే ఇష్టమని నిర్మొహమాటంగా చెప్పేసారు. ఆ ఒక్క మాటతో బాలయ్య గుండెల్లో తమన్ స్థానం ఏంటన్నది అర్దమైపోయింది. `డిక్టెటర్` నుంచి బాలయ్య నటించిన చాలా సినిమాలకు థమన్ సంగీతం అందించాడు. `అఖండ` లో థమన్ బీజీఎమ్ తో ఏకంగా థియేటర్లే దద్దరిల్లిపోయాయి.
తాజాగా రిలీజ్ అయిన `డాకు మహారాజ్` తోనూ మరోసారి అదే సన్నివేశం రిపీట్ అయింది. ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ కాంబోలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయం సాధించాయి. అలా బాలయ్యకు థమన్ ఓ వీరాభిమానిగా మారిపోయాడు. దీంతో థమన్ ఇంటిపేరు మారిపోయిందిప్పుడు. నందమూరి థమన్ అంటూ అభిమానులు అభిమానంతో పిలుచుకుంటున్నారు. `డాకు మహారాజ్` రిలీజ్ అయిన దగ్గర నుంచి నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతుంది.
మా బాలయ్య సినిమాకి పాటలకి సంగీతం అందించాలన్నా బీజీఎమ్ బజాయించాలన్నా అది తమన్ తో మాత్రమే సాధ్యమవుతుందంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇవన్నీ ముందే గెస్ చేసిన బోయపాటి `అఖండ-2`కి థమన్ నే మ్యూజిక్ డైటరెక్టర్ గా తీసుకున్నారు. ఇప్పటికే `అఖండ తాడవం` టైటిల్ ప్రోమోతోనే తమన్ ఊపేసిన సంగతి తెలిసిందే. దీంతో పాటలు....బీజీఎమ్ విషయంలో తమన్ రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాడని తెలుస్తోంది.
బాలయ్య గత సినిమాలు అన్నింటిని మించి ఈసినిమాకి థమన్ పనిచేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఆ విషయంలో అభిమానులు కూడా ఎలాంటి డౌట్ పెట్టుకోవాల్సిన పనిలేదు. బాలయ్య సినిమా అంటే తమన్ కి పూనకం వచ్చేస్తుందని ఫిలిం సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోన్న మాట.