హనుమాన్ పై ప్రశాంత్ వర్మ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `హనుమాన్` గత ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయి పాన్ ఇండియాలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన `హనుమాన్` గత ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయి పాన్ ఇండియాలో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు, మరో రెండు భారీ చిత్రాలు రిలీజ్ అయినా? అన్ని రికార్డులను తల్ల కిందులు చేస్తూ సంచలన విజయం సాధించిందీ చిత్రం. బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధిం చింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.
`హనుమాన్` పై మీరు చూపించిన ప్రేమకు ఎంతో సంతోషంగా ఉంది. మన ఇతిహాస కథను సూపర్ హీరో హంగులు జోడించి మా విజన్ ను మీ ముందుకు తీసుకొచ్చి నేటితో ఏడాది అవు తుంది. ఈ సినిమాకు మీరు అందించిన సపోర్ట్ నాకెంతో విలువైంది. ఈ మేజిక్ ను క్రియేట్ చేయడంలో భాగమైన నటీనటులు, నిర్మాతలకు ధన్యవాదాలు. విజయాన్ని మించి అభిరుచి, ఆశీస్సులు ఉంటే తప్పకుండా అద్బుతాలు సృష్టించవచ్చు అనే గట్టి నమ్మకాన్ని ఈసినిమా నాకు అందించింది` అన్నారు.
ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా `జై హనుమాన్` కూడా ప్రశాంత్ వర్మ పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇందులో కన్నడ నటుడు రిషబ్ శెట్టి హనుమాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి? అన్నది ఈ సినిమా కథగా తెలుస్తుంది.ఈ సినిమాతో పాటు, ప్రశాంత్ వర్మ మరో రెండు ప్రాజెక్ట్ లు కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
`అధీరా`, `బేధియా-2` చిత్రాలు కూడా ప్రకటించారు. `జై హనుమాన్` షూటింగ్ పూర్తయిన తర్వాత `అధీరా` చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అలాగే ప్రశాంత్మ యూనివర్శ్ లో వివిధ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నాడు. నటసింహ బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలు కూడా ప్రశాంత్ వర్మకే అప్పగించారు. మరోవైపు ఆ పనుల్లోనూ వర్మ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.