టెన్నిస్ స్టార్ పై పారీ ప్రేమ క‌విత్వం

Update: 2019-11-16 09:52 GMT
ప్ర‌స్తుతం సైనా నెహ్వాల్ బ‌యోపిక్ లో న‌టిస్తోంది ప‌రిణీతి చోప్రా. మాజీ ప్ర‌పంచ‌సుంద‌రి.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా క‌జిన్ గా రంగ ప్ర‌వేశం చేసిన ఈ అమ్మ‌డికి బాలీవుడ్ లో కెరీర్ ప‌రంగా ఎదురే లేదిప్పుడు. అక్క ప్రియాంక రేంజు కాక‌పోయినా త‌న‌కంటూ ఒక రేంజు ఉంద‌ని నిరూపించింది. రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాల్లోనూ ప‌రిణీతి ఫ్యాన్స్ కి ట‌చ్ లో ఉంటూ ప్ర‌తి విష‌యాన్ని చేర‌ వేస్తుండ‌డంతో అది కాస్తా ప్ల‌స్ అవుతోంది.

అంతే కాదు విభిన్న రంగాల్లో టాప్ రేంజ్ సెల‌బ్రిటీల‌ తో ప‌రిణీతి కి ఉన్న స్నేహాలు ఎంతో ఇంట్రెస్టింగ్. నిన్ననే త‌న స్నేహితురాలు .. టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ‌ర్త్ డే జ‌రుపుకున్న సంద‌ర్భంగా త‌న‌కు విషెస్ చెప్పిన వారిలో ప‌రిణీతి కూడా ఉంది. నేహా ధూపియా- ఫ‌రాఖాన్- సుశీల్ కుమార్- యువ‌రాజ్ సింగ్ వంటి టాప్ సెల‌బ్రిటీల‌తో పాటుగా ప‌రిణీతి త‌న‌ కు పుట్టిన‌ రోజు శుభాకాంక్ష‌లు తెలిపింది. ఇక త‌న స్నేహితురాలి గురించి పారి ఇచ్చిన కొటేష‌న్ ఒక‌టి కుర్రాళ్ల‌ లో హాట్ టాపిక్ గా మారింది. అస‌లింత‌ కీ ప‌రిణీతి ఏమంది అంటే..?

"నువ్వంటే నాకు ఎందుకు ఇష్టం అంటే.. ఇంత పెద్ద ఫేక్ స‌ముద్రంలో నువ్వో రియాలిటీవి. మ్యానిప్యులేట‌ర్స్ ఉన్న ప్ర‌పంచంలో నిజాయితీవి నువ్వు. సెల్ఫ్ మేడ్ ఇంటెలిజెంటువి. ఫ‌న్నీ.. హంబుల్  గాళ్ వి.. ఐ ల‌వ్ యు సానియా. హ్యాపి బ‌ర్త్ డే స‌న్నూ..!" అంటూ తెగ పొగిడేసింది. అన్నిటికంటే ముఖ్యంగా 'నేనెలా ఉంటానో అలా ఉంచేందుకే నువ్వు ఇష్ట‌ప‌డ‌తావ్. నా ర‌హ‌స్యాల‌న్నీ నీకు మాత్ర‌మే తెలుసు" అంటూ తెగ గారాలు పోయింది పారీ. నా లైఫ్ లోకి నువ్వు ఎంట‌రైనందుకు థాంక్యూ అని కూడా అంది ప‌రిణీతి. సానియా తో క‌లిసి ఉన్న ఫోటోని షేర్ చేసింది.

ఇక ప‌రిణీతి సినీ కెరీర్ ని ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం సైనా నెహ్వాల్ బ‌యోపిక్ ఆన్ సెట్స్ ఉంది. దీంతో పాటు `ద గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్` చిత్రీక‌ర‌ణ‌ లోనూ పాల్గొనేందుకు సిద్ధ‌మ‌వుతోంది. `బ‌జ్- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` అనే చిత్రంలో అవ‌కాశం వ‌చ్చినా కాల్షీట్లు స‌ర్ధుబాటు చేయ‌ లేక వ‌దులుకోవాల్సి వ‌చ్చింది. మ‌రిన్ని క‌థ‌ల్ని వింటోందిట వీలున్న ప్ర‌తిసారీ.
Tags:    

Similar News