ఫస్ట్ సింగిల్: రాక్ స్టార్ పరుగు సూపరే

Update: 2019-03-19 12:27 GMT
కిషోర్ తిరుమల దర్శకత్వంలో సాయి తేజ్ హీరో గా తెరకెక్కుతున్న చిత్రం 'చిత్రలహరి'.   ఏంటి.. సాయి ధరమ్ తేజ్ కదా అని సాయి తేజ్ అని ఉంది అని డౌట్ వచ్చిందా?  'చిత్రలహరి' ప్రమోషన్స్ లో 'సాయి తేజ్' అని కొత్తగా టైటిల్ క్రెడిట్ ఇచ్చారు. న్యూమరాలజీ.. ఆస్ట్రాలజీలలో ఏదో ఒకదానిని ఫాలో అయి ఉంటారు. సరే కానీ మన టాపిక్ తేజు పేరు కాదు.  తేజు సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ 'పరుగు పరుగు'.

కాసేపటి క్రితం ఈ మొదటి లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ అనే సంగతి తెలిసిందే.  అసలే ఈమధ్య దేవీ సంగీతంలో పెప్ ఉండడం లేదని రొటీన్ అవుతోందని విమర్శలు ఎక్కువయ్యాయి.  దానికి తోడుగా కొందరు దర్శకులు దేవీకి బదులుగా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వంక చూస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితి లో రిలీజ్ అయిన ఈ 'పరుగు పరుగు' ఎలా ఉంది?  ఒక్క ముక్కలో చెప్పాలంటే బాగుంది.

ఈ పాటకు సాహిత్యం అందించింది దేవీశ్రీ ప్రసాద్.  మనం రెగ్యులర్ గా మాట్లాడే పదాలతో హీరో పాత్ర పడే బాధలను ఫన్నీగా వివరిస్తూ సాగే పాట ఇది. "పరుగు పరుగు వెళ్తున్నా ఎటువైపో జరుగు జరుగు అంటోందే లైఫు.. ఎంత పెంచుకుంటున్నా నా వేగం.. నన్ను దాటి వెళ్తోందే లోకం" అంటూ క్యాచీ పదాలతో సాగింది పాట. పాడిన వారు డేవిడ్ సైమన్.  ఏదో అర్థం కాని రాగాలతో పాడినట్టు కాకుండా మనసులోని భావాలను మాటల్లాగే పాట రూపంలో బైటకి తీసుకొచ్చినట్టుంది.  అసలే మెజారిటీ జనాలకు ఎదురయ్యే పరిస్థితి కాబట్టి వెంటనే కనెక్ట్ అవుతుంది.  దీనికి తోడు ట్యూన్ కూడా డిఫరెంట్ గా క్యాచీగా ఉంది. మొదటి పాటతో దేవీ మ్యాజిక్ చేసినట్టే.   ఆలస్యం ఎందుకు.. చూసేయండి.


Full View

Tags:    

Similar News