హిట్టు కాంబో సెట్ అయ్యిందట..!

Update: 2023-01-03 08:30 GMT
డైరెక్టర్ హీరో కాంబో హిట్ పడితే.. మళ్లీ ఆ ఇద్దరు కలిసి ఎప్పుడు సినిమా సెట్ చేసుకున్నా ఆ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉంటాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో ఉన్నారు నిర్మాత దిల్ రాజు. ఇంతకీ ఎవరా హిట్ కాంబినేషన్ అనుకోవచ్చు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పరశురాం కలయికలో సినిమా ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు.

విజయ్ కి గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురాం తో ఎప్పుడు సినిమా అన్నా తాను రెడీ అంటున్నాడు విజయ్ దేవరకొండ. లైగర్ తర్వాత ఖుషి చేయాల్సి ఉంది. సమంత వల్ల ఆ సినిమా షూటింగ్ వాయిదా పడ్డది.

అందుకే ఈలోగా పరశురాం తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు విజయ్. దిల్ రాజు దగ్గర విజయ్ డేట్స్ ఉండటంతో ఈ కాంబోకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. పరశురాం తో కూడా కొన్నాళ్లుగా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు దిల్ రాజు.

మొత్తానికి హిట్టు కాంబో కుదిరింది. సర్కారు వారి పాట తర్వాత పరశురాం అసలైతే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఎందుకో ముందుకు సాగలేదు. అయితే చైతన్యకు రాసిన కథనే విజయ్ దేవరకొండ ఇమేజ్ కి తగినట్టు మార్చి ఈ సినిమా తీస్తున్నాడట పరశురాం. తనకు గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు పరశురాం మీద నమ్మకంతోనే విజయ్ ఈ సినిమా ఓకే చెప్పారట.

మరి గీతా గోవిందం కాంబో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో కూడా విజయ్ దేవరకొండ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

త్వరలోనే ఈ రెండు సినిమాల ఎనౌన్స్ మెంట్ తో విజయ్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేస్తాడని అంటున్నారు. విజయ్ సినిమా తర్వాత పరశురాం బాలకృష్ణతో కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నట్టు టాక్. ఆమధ్య బాలయ్యతో పరశురాం సినిమా అంటూ మీడియా హడావిడి చేసింది. ఆ కాంబో సినిమాని అల్లు అరవింద్ నిర్మిస్తారని అంటున్నారు.

 

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News