ఎవ్వరికి అర్థం కాని వ్యక్తి పవన్ కళ్యాణ్. సినిమాల్లో సూపర్ స్టార్ గా వెలుగు వెలుగుతున్న సమయంలో రాజకీయాల్లోకి వెళ్లాడు. సరే అక్కడ మొదటి సారి ఎన్నికల్లో పోటీ చేశాడా అంటే అదీ లేదు. పార్టీ పెట్టి పోటీ చేయక పోవడం ఏంటీ.. ఆ పార్టీని బలోపేతం చేయక పోవడం ఏంటీ అంటూ కొందరు విమర్శలు చేశారు. ఇక అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ సినిమాలకు దూరం అయ్యాడు. పూర్తి స్థాయి రాజకీయాలు చేస్తానన్నాడు. ఆర్థిక అవసరాల కోసం మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఇన్ని చేస్తున్నా కూడా పవన్ ఫ్యాన్స్ మాత్రం ఆయన్ను అభిమానిస్తూనే ఉన్నారు. కాని ఈమద్య కాలంలో ఆయన లుక్ ను చూసి ఫ్యాన్స్ కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ గతంలో జట్టు పెంచుకోవడం గడ్డం పెంచుకోవడం చేశాడు. ప్రతి ఏడాది చతుర్మాస దీక్ష సందర్బంగా పవన్ అలా జట్టు గడ్డం పెంచుతాడు. ఈసారి కూడా పవన్ జుట్టు గడ్డం పెంచాడు. తాను ప్రస్తుతం చతుర్మాస దీక్ష చేస్తున్నట్లుగా పవన్ చెప్పాడు. ఈ సమయంలో నేను ఒంటి పూట భోజనం చేస్తున్నట్లుగా చెప్పాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కాని తాజాగా నితిన్ పెళ్లి వేడుకకు హాజరు అయిన సమయంలో తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా చెట్టు నాటిన సందర్బంగా ఆయన అవతారం చూసి ఫ్యాన్స్ కాస్త జుట్టు గొక్కుంటున్నారు.
వర్మ వంటి వారికి ట్రోలింగ్ కు ఛాన్స్ ఇవ్వడం తప్ప ఏంటీ ఇది అంటున్నారు. అంత గడ్డం జుట్టు వేసుకుని కాషాయం వేస్తే స్వామీజీ అనుకోరా. ఇప్పటికే చాలా మంది బాబాలు ఉన్నారు. ఇప్పుడు కొత్త బాబా అంటూ ప్రచారం చేయరా అంటూ పవన్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ గడ్డం జుట్టు పెంచినా కూడా సాదారణ డ్రస్ లో బాగానే ఉన్నాడు. కాని మరీ ఈ కాషాయం వేయడం ఏంటీ బాసూ అంటూ ప్రశ్నిస్తున్నారు. మళ్లీ ఆ అవతారంలో పవన్ ను చూడొద్దని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ దీక్షలు పట్టుకుని ఉంటే కమిట్ అయిన మూడు సినిమాలు ఎప్పుడు పూర్తి చేస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.